Vijayawada, OCT 20: ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం (Bay Of Bengal) కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఎల్లుండికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో (Cyclone Forming In Bay Of Bengal) తుపానుగా మారే అవకాశముందని, 24 నాటికి ఒడిశా-బంగాల్ తీరాలకు చేరుకునే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.
దీని ప్రభావంతో 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణకేంద్రం ప్రకటించింది. 23, 24 తేదీల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈదురుగాలులు వీస్తాయని, జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది.