Lightning: ప్రకృతి కన్నెర్ర.. కర్రలు తొలగిస్తుండగా పిడుగుపాటు.. నలుగురు మృతి.. ఏలూరులో దారుణ ఘటన

Eluru, August 17: ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చింతలపూడి నియోజకవర్గం లింగంపాలెం మండలం బోగోలులో పిడుగుపాటుకు గురై నలుగురు కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

పోలీసులమంటూ పొదల్లోకి తీసుకెళ్లి యువతిపై దారుణంగా అత్యాచారం, నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన మచిలీపట్నం పోలీసులు

జామాయిల్‌ తోటలో పనికి వచ్చిన దాదాపు 30 మంది కూలీలు.. అక్కడే టెంట్లు వేసుకుని ఉంటున్నారు. జామాయిల్‌ కర్రలు తొలగిస్తుండగా పిడుగుపడడంతో ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.