Giddaluru Shocker: నీ కోసమే హిజ్రాగా మారా..నన్నేపెళ్లి చేసుకోమన్న ట్రాన్స్‌జెండర్, యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యాయత్నం, ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఘటన
Same-Sex Marriage (Photo Credits: Pixabay)

Giddaluru, August 8: ఏపీలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తన లవర్ పెళ్లికి నిరాకరించాడని ఓ హిజ్రా ఆత్మహత్యా యత్నం చేసింది. అందుకు ముందు లవర్ వేరే పెళ్లి చేసుకుంటుండగా దాన్ని అడ్డుకుంది. నన్ను పెళ్లి చేసుకోవాలని పెళ్లికొడుకును కోరింది. అతను తిరస్కరించడంతో తట్టుకోలేక ఆత్మహత్యా యత్నానికి (transgender attempts suicide ) పాల్పడింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఘటన వివరాల్లోకెళితే.. రాచర్ల మండలం పాలకవీడు గ్రామానికి చెందిన మగ్బూల్, అర్థవీడు మండలంలోని పాపినేనిపల్లెకు చెందిన వినీత్‌ ఇద్దరూ క్లాస్‌మేట్స్‌. అంతే కాకుండా మంచి స్నేహితులు. వీరు కలిసి ఉంటూ ఆర్మీ సెలక్షన్స్‌కు వెళ్లగా వారిలో మగ్బూల్‌ ఆర్మీకి ఎంపికవగా, వినీత్‌ ఎంపిక కాలేదు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం వినీత్‌ హిజ్రాగా మారి వినీతగా పేరు మార్చుకున్నాడు. అయినప్పటికీ మగ్బూల్‌తో స్నేహం కొనసాగిస్తూ వచ్చాడు. వారిద్దరు తమ స్నేహాన్ని సహజీవనంగా కూడా మార్చుకున్నారు.

ఉలిగమ్మ ఉత్సవంలో హిజ్రాల మధ్య గొడవ, పోలీస్ స్టేషన్‌కి చేరిన పంచాయితీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన పోలీసులు, అనంతపురంలో ఘటన

మగ్బూల్‌ ఆర్మీలో చేరిన తరువాత కూడా వినీతతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేవాడు. సెలవుపై వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి సరదాగా తిరిగేవారు. ఇటీవల సెలవుపై వచ్చిన మగ్బూల్‌.. గిద్దలూరు పట్టణానికి చెందిన మహిళను వివాహం చేసుకునేందుకు నిశ్చయించుకున్నాడు. శుక్రవారం ఓ కల్యాణ మండపంలో వివాహం చేసుకుంటుండగా, సమాచారం తెలుసుకున్న హిజ్రా వినీత.. పలువురు హిజ్రాలతో కలిసి అక్కడకు చేరుకుని మగ్బూల్‌ వివాహాన్ని అడ్డుకుంది.

పెళ్లయి మూడేళ్లయినా శోభనం లేదు, తీరా చూస్తే భర్త స్వలింప సంపర్కుడు, విడాకులు కావాలని న్యాయస్థానంలో పోరాటం చేస్తున్న బాధిత భార్య, కర్ణాటకలో ఘటన

తననే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. మగ్బూల్‌ నిరాకరించడంతో (lover rejected marriage) ఆత్మహత్యకు పాల్పడగా, కర్నూలు జిల్లాలోని నంద్యాల వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.