చెన్నై, జనవరి 29: దివంగత సినీ నటుడు, ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు భార్య శివకామసుందరి (81) చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. చెన్నైలోని టి నగర్ లో శారదాంబాళ్ వీధిలో శివకామసుందరి నివాసం ఉంటున్నారు. శివకామసుందరి మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. శుక్రవారమే కన్నమ్మపేటలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. హన్మకొండలో పుట్టిన శివకామసుందరికి 1961లో మారుతీరావుతో వివాహమైంది. రామభక్తురాలైన ఆమె.. మూడున్నరకోట్ల రామకోటి రాసినట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు.
కాగా.. 2019లో గొల్లపూడి మారుతీరావు అనారోగ్యంతో కన్నుమూయగా.. అప్పట్నుంచి ఇప్పటివరకూ.. శివకామసుందరి తన కుమారుడు సుబ్బారావు నివాసంలోనే ఉంటున్నారు.