Vijayawada, Ju;y 03: ఏపీ సీఎం వైఎస్ జగన్ కుమార్తె (YS Jagan Daughter) వైఎస్ హర్షిణి రెడ్డి (YS Harshini)మాస్టర్స్‌లో సత్తా చాటారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు (Paris) చెందిన వర్సిటీలో హర్షిణి మాస్టర్స్ విద్యనభ్యసించారు. శనివారం ఆమె మాస్టర్స్ పట్టా (Masters Degree) అందుకున్నారు. మాస్టర్స్‌లో హర్షిణి రెడ్డి డిస్టింక్షన్‌తో పాస్ అయ్యారు. వర్సిటీ నుంచి హర్షిణి రెడ్డి పట్టా తీసుకుంటున్న ఫొటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. కుమార్తె హర్షిణి రెడ్డి మాస్టర్స్ పట్టా అందుకునే స్నాతకోత్సవానికి జగన్ దంపతులు పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రుల సమక్షంలోనే హర్షిణి రెడ్డి పట్టా పుచ్చుకున్నారు. హర్షిణి రెడ్డిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ తన కూతురు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘డియర్ హర్షా చాలా గర్వంగా ఉంది..’ అంటూ ట్వీట్ చేశారు. నీవు ఎదిగిన తీరు అమిత సంతోషాన్నిచ్చిందని జగన్ పేర్కొన్నారు.
Dear Harsha, it’s been a wonderful journey watching you grow up. God has been abundantly gracious. Today I’m proud to see you graduate from INSEAD with distinction and on the Dean’s list. Wishing you God’s very best! pic.twitter.com/7FuZcXp4uT
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 2, 2022
దేవుడు నీ పట్ల కృప చూపించాడని అన్నారు. ఈ రోజు ఇన్‌సీడ్ నుంచి డిస్టింక్షన్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం నాకు గర్వంగా ఉందని జగన్ ట్వీట్‌లో తెలిపారు. డిస్టింక్షన్‌తో పాటు డీన్స్ జాబితాలోనూ చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు.
వైఎస్ హర్షిణి రెడ్డి (YS Harshini Reddy) పారిస్‌లోని ఇన్‌సీడ్ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో భాగంగా మాస్టర్స్ డిగ్రీ పట్టాను హర్షిణి అందుకున్నారు. ఈ స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు జగన్ దంపతులు పారిస్ వెళ్లారు. అక్కడే పట్టా అందుకున్న కూతురుతో కలిసి జగన్ దంపతులు ఫొటో దిగారు. ఈ ఫొటోను జగన్ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.