Representational Picture

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద తెలిపారు. పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోందని..దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతో పాటు, కొన్ని చోట్లు భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని అధికారులు తెలిపారు.

మంగళవారం పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా వర్షాలు పడటంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిసింది. పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

వీడియో ఇదిగో, ఏపీలో పెట్టుబడుల పెట్టేందుకు వైఎస్‌ జగన్‌ను కలిసిన భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్‌నాసర్‌ అల్షాలి

తీవ్రమైన ఎండలు మండే మే నెలలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రమంతా కుండపోత వర్షాలు కురుస్తు­న్నాయి. ఆదివారం రాత్రి నుంచి అనేక జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.