Image used for representational purpose | (Photo Credits: PTI)

Hindupur, August 25: ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం లాడ్జిలో మృతి చెందిన యువతి కేసును (Hindupur Lodge Death Case) పోలీసులు చేధించారు. ఈ ఘటనలో ఆమె ప్రియుడే దారుణంగా చంపాడని (Police confirmed she was murdered)పోలీసులు నిర్థారించారు. ఈ కిరాతకానికి అతని స్నేహితుడు కూడా సహకరించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. తెలంగాణ వరంగల్‌ లోని ములుగు జిల్లా మంగపేటకు చెందిన వైద్య విద్యార్థిని అక్షిత ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది.ప్రస్తుతం కర్ణాటకలోకి చిక్‌బళ్లాపూర్‌ మెడికల్‌కాలేజీలో డీఎన్‌బీ (పీజీ) చేస్తోంది.

అయితే అక్షిత, సంగారెడ్డి పటాన్‌చెరువుకు చెందిన మహేష్‌ వర్మ అనే యువకునితో కలిసి హిందూపురంలోని ఓ లాడ్జిలో బస చేశారు. అదే రోజు సాయంత్రం ఆమె చనిపోయినట్లు మహేష్‌ పోలీసులకు సమాచారం అందించాడు.ఇద్దరం స్నేహితులమని, మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నామని, లేచి చూస్తే ఆమె చనిపోయి ఉందని పోలీసులకు చెప్పాడు.

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు చిన్నారులు సహా 9 మంది మృతి, వేగంగా వచ్చి ఢీకొట్టిన లారీ, డ్రైవర్ నిద్రమత్తే కారణమంటున్న ప్రత్యక్ష సాక్షులు

దీంతో స్థానికంగా అనుమానాస్పద మృతి కలకలం రేగింది. వెంటనే పోలీసులు అక్షిత బంధువులకు సమాచారం ఇచ్చి అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో అతను స్నేహితుడు కాదని, ప్రియుడని తేలింది. హైదరాబాద్‌లో ఇంటీరియర్‌ డిజైనర్‌గా పని చేస్తున్న మహేష్‌.. అక్షితతో తనకు సంబంధం ఉందని ఒప్పుకున్నాడు. లాడ్జిలో ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. అయితే.. ఆమెను ఎందుకు చంపాడనే విషయంపై ఇంకా ప్రకటన వెలువడలేదు.