Representative (Image: Credits: PTI)

Amaravati, April 11: ఏపీలో ఎండల తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 119 కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు గుర్తించారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటె సగటున రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగినట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

ఈ ఏడాది సాధారణ రుతుపవనాలు, అంచనా వేసిన భారత వాతావరణ విభాగం, కరువు తాండవిస్తుందని తెలిపిన స్కైమెట్‌ వెదర్‌

అత్యధికంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా రాజాంలో 41.8, నంద్యాల జిల్లా అవుకులో 41.6, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం, విజయనగరం జిల్లా అల్లాడపాలెంలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు, హ్యుమిడిటీని విశ్లేషించినప్పుడు చాలా ప్రాంతాల్లో అసౌకర్య సూచికలు (డిస్‌­కంఫర్టబుల్‌ ఇండెక్స్‌) పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు ఎండ ప్రభావంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు చెబుతున్నారు.

రైతన్నపై మళ్లీ పిడుగు, దేశంలో కరువు సంభవించడానికి 20 శాతం అవకాశాలు, ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడతాయని అంచనా వేసిన స్కైమెట్‌ వెదర్‌

ఎండ, ఉక్కపోతతో ఈ పరిస్థితి నెలకొందంటు­న్నారు. వారం రోజుల పాటు ఇలాగే వేడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెబుతున్నారు. మంగళవారం 26 మండలాల్లో వడగాడ్పులు వీచే అవ­కాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అడ్డ­తీగల, నెల్లిపాక, చింతూరు, గంగవరం, రాజ­వొ­మ్మంగి, వరరామచంద్రపురం, కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం తదితర మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది.