Low pressure (Photo Credits: PTI)

Amaravati, Nov 22: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వాయవ్యదిశగా కదులుతోంది. ఇది సోమవారం అర్ధరాత్రి తర్వాత నుంచి పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి, ఆగ్నేయ. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం చెన్నైకి తూర్పున 140, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 225కి.మీ.దూరంలో కొనసాగుతుంది.వచ్చే 24 గంటల్లో తమిళనాడు, ఏపీ దక్షిణ కోస్తా దిశగా పయనించే అవకాశం ఉందని తెలిపింది.

తీరానికి సమీపించే కొద్దీ బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గాలులు బలంగా వీస్తున్నాయి.ప్రకాశం,నెల్లూరు,రాయలసీమ జిల్లాలలో వర్షాలు పడతాయని (IMD issues heavy rain alert) వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో బులెటిన్ వార్నింగ్ కొనసాగిస్తుంది ఐఎండీ.దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో (south coastal Andhra, Rayalaseema) ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ భారీవర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. రాబోయే 48 గంటల్లో.. తమిళనాడు, ఏపీ తీరానికి దగ్గరగా రానుందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

చ.. చ.. చలి.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత.. ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో అంతకంతకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఇవాళ, రేపు చలి మరింతగా ప్రభావం..

ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు.చేపలు పట్టేవారు.. సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం వుంది. మళ్లీ భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వరి రైతులు బిక్కుబిక్కుమంటున్నారు.కోతల సమయంలో వానలు కురిస్తే చేతికందిన పంటి నీట మునుగుతుందని రైతులు ఆందోళనపడుతున్నారు