AP Weather Forecast: ఏపీలో మూడు రోజులు అలర్ట్, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
HYderabad Rains (Photo-Twitter)

దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం మధ్య భాగాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంపైకి వాయవ్య గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ తెలిపారు.

అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని ఒక ప్రకటనలో సూచించారు. సోమ, మంగళ, బుధవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆదివారం రాత్రి తెలిపింది.

దేశంలో పలు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లో ఈవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐంఎడీ

అదే సమయంలో దక్షిణ కోస్తా, సీమల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. ఉత్తర కోస్తాలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురవవచ్చని పేర్కొంది. ఈ వర్షాలతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే జిల్లాలు

సోమవారం: అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైయస్‌ఆర్‌

మంగళవారం: పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు, వైయస్‌ఆర్‌, నంద్యాల

బుధవారం: పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల