Vijayawada, June 02: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Jana Sena Chief Pawan Kalyan) ‘వారాహి’పై యాత్రకు (Varahi Yatra) సిద్ధమవుతున్నారు. ఇటీవల కాలంలో సినిమా షూటింగులతో బిజీ బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ మరోసారి ప్రజల్లోకి రాబోతున్నారు. తాను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న వారాహి వాహనంపై యాత్రకు బయలుదేరనున్నారు. దీని కోసం రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు. జూన్ 14 నుంచి వారాహిపై పవన్ కల్యాణ్ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం (Annavaram)లో రత్నగిరిపై కొలువైన సత్యనారాయణ స్వామి సన్నిధిలో వారాహికి (Varahi Yatra) పూజలు చేయించి స్వామివారిని పవన్ కల్యాణ్ దర్శించుకుని యాత్రను ప్రారంభించనున్నారని జనసేన పార్టీ (Janasena Party) పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు.
జూన్ 14 నుండి ప్రజల్లోకి వారాహి#JanaSenaVarahi pic.twitter.com/TARjJSpv83
— JanaSena Party (@JanaSenaParty) June 2, 2023
పవన్ వారాహి యాత్ర ఒకేవిడతగా కాకుండా పలు విడతలుగా చేయనున్నారు. దీంట్లో భాగంగా మొదటి విడత అన్నవరం నుంచి భీమవరం (Bhimavaram) వరకు యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల తెలిపారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో గోదావరి జిల్లాల నేతలతో నాదెండ్ల సమావేశమై యాత్ర గురించి చర్చించారు. ఈ యాత్ర ద్వారా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని తెలిపారు. మహిళలు, రైతులు, యువత సమస్యల్ని తెలుసుకుంటారని.. ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి పవన్ యత్నిస్తున్నారని దీంట్లో భాగంగానే వారాహి యాత్ర అని తెలిపారు. ప్రజా క్షేమం కోరి, రాష్ట్ర క్షేమం కోసం పవన్ చేసే ఈ యాత్ర ఉపయోగపడుతుందన్నారు. యాత్రలో భాగంగా పవన్ ఎంతోమందిని కలుసుకుని స్థానిక సమస్యలపై దృష్టి పెట్టనున్నారని తద్వారా పరిష్కార మార్గాల కోసం కృషి చేయనున్నారని నాదెండ్ మనోహర్ తెలిపారు.
జూన్ 14 నుండి ప్రజల్లోకి @JanaSenaParty "వారాహి"#JanaSenaVarahi pic.twitter.com/bJbUgOsCbA
— JanaSena Shatagni (@JSPShatagniTeam) June 2, 202
పవన్ వారాహి యాత్ర ఒకేవిడతగా కాకుండా పలు విడతలుగా చేయనున్నారు. ఒక్కో విడతలో రెండు జిల్లాల చొప్పున పర్యటన కొనసాగేలా ప్లాన్ వేస్తున్నారు. ఈ యాత్రలో ప్రజల్లో చైతన్యం కోసం జనసేన బలా బలాలను తెలుసుకోవటం కూడా భాగంగా ఉంది. మరి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జనసేన బలంపైన అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అంచనాలను ఆచరణలోకి తీసుకురావటానికి ఈ యాత్రను ఉపయోగించుకోనున్నారు పవన్ కల్యాణ్. అలాగే జనసేన నేతల అంచనా ప్రకారం ఈ రెండు జిల్లాలో మెజారిటీ సీట్లు సాధిస్తామని భావిస్తున్నారు.
జూన్ 14 నుంచి వారాహి యాత్ర, అన్నవరం సత్యదేవుడి ఆశీస్సులతో యాత్రకు శ్రీకారం#JanaSenaVarahi pic.twitter.com/VGwvnIVQWb
— JanaSena Party (@JanaSenaParty) June 2, 2023
కాగా పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖలోని గాజువాక నుంచి పోటీ చేసి రెండుచోట్లా ఓటమిపాలయ్యారు. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా మరోసారి పోటీకి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈసారి సీఎం పదవే లక్ష్యంగా కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులతో పవన్ ముందుకెళ్లాలని భావిస్తున్నారు. పవన్ 2024 ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ప్రభావం చూపనున్నారు. గత ఎన్నికల తరువాత ఓటమి భయంతో వెనుకడుగు వేయకుండా పలు పర్యటనలతో ప్రజలతో మమేకమవుతున్నారు. పలు పర్యటనలతో ప్రజలకు దగ్గరవుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయటంతో పాటు అకాల వర్షాలకు పంటలను కోల్పోయిన రైతుల్ని పరామర్శించటం వంటి పలు కీలక కార్యక్రమలతో ఓ పక్క.. సినిమా షూటింగులు మరోపక్క పర్యటనలతో బిజీ బిజీగాగా ఉన్నారు.
వారాహి యాత్ర సాగే నియోజకవర్గాలు#JanaSenaVarahi pic.twitter.com/DCLiK6AIFq
— JanaSena Party (@JanaSenaParty) June 2, 2023
ఇక ఆ మూవీ షూటింగ్ స్పీడ్ చూసిన పవన్ అభిమానులు.. మొత్తం మూవీ షూటింగ్స్ అన్ని కంప్లీట్ చేస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు తన రాజకీయ ప్రచారాన్ని స్టార్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. ఈ నేపథ్యంలోనే వారాహి షెడ్యూల్ ని రిలీజ్ చేశాడు. దీంతో ప్రస్తుతం చేయాల్సిన సినిమా షెడ్యూల్స్ సంగతి ఏంటని అభిమానులు కన్‌ఫ్యూషన్ లో పడ్డారు. మొన్నటి వరకు పవన్ డిసెంబర్ వరకు షూటింగ్స్ లో పాల్గొని సినిమా చిత్రీకరణలు అన్ని పూర్తి చేస్తాడని టాక్ వినిపించింది.
JanaSena Party PAC Chairman Shri @mnadendla Press Meet at Mangalagiri Party Office
LIVE LINK: https://t.co/IUVhdjJjj3
— JanaSena Party (@JanaSenaParty) June 2, 2023
ఇప్పుడు రాజకీయ ప్రచారానికి శంఖం పూరించడంతో సినిమా సంగతులు ఏంటని అభిమానులు అరా తీస్తున్నారు. వీరమల్లు షూటింగ్ జూన్ లోనే మొదలు అవుతుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ ఇంకా 50 శాతం పెండింగ్ ఉంది. ఇక ఉస్తాద్ మూవీ విషయానికి వస్తే.. ఒక షెడ్యూల్ ని మాత్రమే పూర్తి చేసుకుంది. OG మూవీ మొదటి షెడ్యూల్ ని ముంబైలో పూర్తి చేసేసిన పవన్.. ఇప్పుడు హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ పాల్గొంటున్నాడు. అయితే పవన్ ప్రచారం చేస్తూనే ఈ సినిమా చిత్రీకరణలు కూడా పూర్తి చేస్తాడా? లేదా షూటింగ్స్ కి కంప్లీట్ గా బ్రేక్ ఇవ్వబోతున్నాడా? అనేది మూవీ టీమ్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.