Vijayawada, SEP 16: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు (JSP-TDP) ఉంటుందని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరఫున ఒక కమిటీని ప్రకటించారు. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు స్పీకర్‌గా పనిచేసిన ఆయన అనుభవం ఇందుకు ఉపయోగపడుతుందన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన (Janasena) విస్తృతస్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ ఇప్పటికీ ఎన్డీఏలో భాగస్వామిగానే ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రజలకు బలంగా చెప్పాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు మంచిరోజులు వస్తున్నాయి, కొత్త ప్రభుత్వం రాబోతుంది
• పవర్ షేరింగ్ ఎలా అనేది నాకు వదిలేయండి, మనం వైసీపీ ను ఓడిద్దాం.
• 2009 లో కలలు కన్న కలను 2024 లో మనం సాకారం చేద్దాం
• We are in NDA, We are with BJP , We are with Narendra Modi Ji. pic.twitter.com/pOb9s9ZF9d
— JanaSena Party (@JanaSenaParty) September 16, 2023
పార్టీ శ్రేణులు ఎలాంటి భేషజాలకు పోవొద్దని సూచించారు. ‘‘ఒకరు ఎక్కువ కాదు..మరొకరు తక్కువా కాదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడమే ముఖ్యం. పదేళ్ల నుంచి మీరు అండగా ఉన్నారు.. కొంత మంది 2009 నుంచి ఎదురు చూస్తున్నారు.. అది 2024లో సాధిద్దాం. వైయస్సార్‌సీపీ నాయకులు ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఎవరూ గొడవ పెట్టుకోవద్దు. వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ఇదే సరైన సమమం. 2024 ఎన్నికల తర్వాత అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం. సమయం వచ్చినప్పుడు పవర్ షేరింగ్‌పై మాట్లాడుతాం.
• ముందు మనం వైసీపీని ఓడిద్దాం, తరవాత రాజు, మంత్రి ఎవరు అనేది ఆలోచిద్దాం, అనవసరమైన చర్చలు వద్దు
• One man's courage makes a majority
• జనసేన విస్తృత స్థాయి సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు pic.twitter.com/9g1PwZcc4o
— JanaSena Party (@JanaSenaParty) September 16, 2023
ఎన్నికల్లో గెలిచాక రాజు ఎవరో.. మంత్రి ఎవరో తేలుతుంది. జనసేన అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్ర దశ, దిశ మారుస్తాం. కొందరు అధికారులు ఇకనైనా పద్ధతి మార్చుకుని.. త్వరలో రాబోయే టీడీపీ, జనసేన.. బీజేపీ ఆశీస్సులతో ఏర్పడబోయే ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులొచ్చాయి.. రాష్ట్రానికి బలమైన భవిష్యత్ ఇవ్వబోతున్నాం’’ అని పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు వివరించారు.