Pawan Kalyan Fire on YSRCP: జనానికి ధైర్యం ఇంజెక్ట్ చేస్తాం, ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు, ఏపీ సర్కారుపై జనసేనాని మండిపాటు, కార్మికులంటే జగన్ కు గౌరవం లేదన్న పవన్ కల్యాణ్
Pawan Kalyan Serious on Janasena Activists in Farmers Meet File image of Pawan Kalyan | File Photo

Amarawathi, July 10: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) మరోసారి ఏపీ ప్రభుత్వంపై (Ap govt) ఫైర్ అయ్యారు. జగన్ సర్కార్ (YS Jagan) వైఖరిపై విరుచుకుపడ్డారు. ప్రశ్నిస్తే బెదిరించడం వైసీపీ నైజం అంటూ ధ్వజమెత్తారు జనసేనాని (janasena)పవన్ కళ్యాణ్. ”రోడ్లు లేవని ప్రజలు ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. అన్యాయాన్ని నిలదీస్తే భయపెడుతున్నారు. పథకాలు ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు. పిరికితనం నిండిన జనానికి ధైర్యం ఇంజెక్ట్ చేయాలి” అని పవన్ అన్నారు. ఆదివారం రెండో విడత జనవాణి(janavani) కార్యక్రమంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు పవన్. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. విజ్ఞప్తుల స్వీకరణ ముగిసిన తర్వాత పవన్ మీడియా సమావేశం నిర్వహించారు. జనవాణి వంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సాహసంతో కూడుకున్నదని పవన్ అన్నారు. వాస్తవానికి జనవాణి(Janavani) వంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాల్సిన పని అని వెల్లడించారు. ప్రజల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించాలో ప్రభుత్వానికి చూపిస్తున్నామని పవన్ స్పష్టం చేశారు.

”నేను గతంలోనే ఇసుక అక్రమాలపై గళం ఎత్తాను. వీళ్లు అంతకంటే రెచ్చిపోయి అక్రమాలు చేశారు. గత మూడేళ్లుగా మేడే కార్యక్రమాలు నిర్వహించకపోవడం చూస్తుంటే వైసీపీ నేతలకు కార్మికులంటే ఎంత గౌరవమో అర్థమవుతుంది. కార్మిక మంత్రి ఏనాడైనా సమస్యలు తెలుసుకున్నారా? అన్ని విభాగాలకు కలిపి సజ్జల వంటి పెద్దలు ఒకరే మంత్రిగా ఉంటారు” అంటూ విమర్శలు గుప్పించారు పవన్.

YSRCP Plenary 2022: వైరల్ వీడియో.. జోరు వానలో జగన్నినాదాలు, భారీ వర్షంలో తడుస్తూ జై జగన్ అంటూ నినాదాలు చేసిన అభిమానులు 

”రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR), ఏపీ సీఎం జగన్ (YS Jagan)ఫ్రెండ్లీగా ఉండడం చూస్తున్నాం. ఆలింగనాలు చేసుకుంటారు. అలయ్ బలయ్ లు చేసుకుంటారు. ఇద్దరూ చాలా సౌకర్యవంతంగా ఉంటారు. ప్రేమ పూర్వకంగా మాట్లాడుకుంటారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో చాలా కులాలు, ఉత్తరాంధ్రలో 18 వరకు కులాలు బీసీ హోదా కోల్పోయాయి. దీని గురించి ఒక్కరోజు కూడా మాట్లాడుకోరు. తెలంగాణలో బేడ బుడగజంగాల కులమే లేదంటూ వారి గుర్తింపును రద్దు చేశారు” అని పవన్ ధ్వజమెత్తారు.