Cyclone (Photo credits: IMD)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని జవాద్‌ తుపాన్‌ ముప్పు వణికిస్తోంది. దక్షిణ అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. ఇది ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. నేడు ఈ తుఫాను తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్రంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారుల ఆదేశాలు జారీ చేశారు.

Andhra Pradesh Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ గురువారం నాటికి దాదాపు దక్షిణ కోస్తా – ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక గురువారం నాడు దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలినచోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్లు.. గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ సూచించారు. గురువారం వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇదిలాఉంటే.. 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో.. తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. రిజయర్వాయర్లు, చెరువులు, నీటినరుల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆహారం, మందులు సిద్ధంచేసుకోవాలన్నారు.