Bangalore, JAN 28: గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన నందమూరి తారకరత్న (Taaraka Ratna Health) అత్యంత విషమంగా ఉంది. గుండె నాళాల్లోకి రక్తప్రసరణ కాకపోవడంతో ఆయన్ను బతికించేందుకు నారాయణ హృదయాలయ వైద్యలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బెలూన్ యాంజియోప్లాజీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నందమూరి తారకరత్న పరిస్థితి క్రిటికల్‌గా ఉందని తెలిసి నందమూరి కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా ఆస్పతికి చేరుకుంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణ దగ్గర ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తుండగా.. మోహన్ కృష్ణ, నారా చంద్రబాబు(Chandrababu), భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఆస్పత్రికి చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) కూడా ఆస్పత్రికి వచ్చారు.
Taraka Ratna: బెంగళూరుకు తారకరత్న తరలింపు.. నిలకడగానే ఆరోగ్యం
ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. తారకరత్న పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని వెల్లడించారు. సోమవారం మరోసారి పరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పినట్టు పేర్కొన్నారు. తారకరత్న హెల్త్ కండీషన్ ను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.
#NandamuriTarakaRatna Health Update: Remains Critical. pic.twitter.com/fp9Z1auoWR
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) January 28, 2023
తారకరత్న గుండెలో ఎడమ వైపు వాల్ 90 శాతం బ్లాక్ అయిందని. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు హాస్పిటల్ కి తరలిస్తున్నాము. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. త్వరలోనే అతను కోలుకుంటాడు అని చెప్పాడు. ఇక నిన్న రాత్రి వేళ బాలకృష్ణ దగ్గర ఉండి తారకరత్నని అత్యాధునిక సదుపాయాలు ఉన్న ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరు తీసుకువెళ్లాడు.