MP Avinash Reddy (Photo-Video Grab)

Hyderabad, April 17: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు విచారణ దూకుడుగా సాగుతున్నది. విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ (CBI) నుంచి నోటీసులు (Notices) అందుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) హైదరాబాద్ (Hyderabad) పయనమయ్యారు. ఈ తెల్లవారుజామున అనుచరులతో కలిసి 10 వాహనాల్లో పులివెందుల నుంచి భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ బయలుదేరారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి గత రాత్రి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన పులివెందుల నుంచి హైదరాబాద్ వస్తున్నారు.

Jagadish Shettar: రసవత్తరంగా కన్నడ రాజకీయం.. రాష్ట్ర బీజేపీకి మరో భారీ షాక్.. నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్న జగదీశ్ షెట్టర్!

చంచల్‌గూడ జైలుకు భాస్కర్‌రెడ్డి

అవినాష్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే నాలుగుసార్లు విచారించింది. ఇది ఐదోసారి. ఇదే కేసులో నిన్న ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ ఆ వెంటనే అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, భాస్కర్‌రెడ్డికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Dubai Fire Accident: దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు భారతీయులు సహా 16 మంది సజీవ దహనం.. మరణించిన వారిలో కేరళ, తమిళనాడు వాసులు