ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు, వాటికి పేర్ల విషయంపై ఇంకా సూచనలు ప్రభుత్వానికి అందుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అభ్యంతరాలకు నెల రోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అనేక మంది తమ సూచనలను ప్రభుత్వానికి తెలియ జేస్తున్నారు. కృష్ణా జిల్లాకు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలంటూ ఏఎన్నార్ అభిమానుల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అక్కినేని నాగేశ్వరరావు చలనచిత్ర పరిశ్రమలో అనేక సంవత్సరాలు రెండు రాష్ట్రాలను అలరించారని గుర్తు చేస్తున్నారు.
దాదాసాహెబ్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులను సొంతం చేసుకున్న నాగేశ్వరరావు పేరును కృష్ణా జిల్లకు పెట్టాలని కోరుతున్నారు. ఏఎన్నార్ గుడివాడలో జన్మించారని, మద్రాసు నుంచి హైదరాబాద్ కు చిత్ర పరిశ్రమను తీసుకు వచ్చే విషయంలో ఆయన శ్రమను గుర్తించాలని వారు కోరుతున్నారు.