Amaravat, Feb 4: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకునేందుకు పిల్లను ఇవ్వడం లేదని మామపై కక్ష కట్టిన మేనల్లుడు కత్తితో దాడి (man attack on uncle) చేసి గాయపరిచాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పీరాపురంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండి శివ తన మామను కలిసి పెళ్లి చేసుకునేందుకు కుమార్తెను తనకు ఇవ్వాలని కోరాడు.
అయితే మామ దీనికి ససేమిరా అన్నారు. నీకు నా కూతుర్ని ఇవ్వడం ఇష్టం లేదని (rejected marriage with his daghter) తెలిపారు. మామ మారంరెడ్డి నరసింహారెడ్డి ఒక్కసారిగా ఇలా చెప్పడంతో మేనల్లుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మామపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అంతటితో ఆగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమార్తెపై కూడా అదే కత్తితో చేతిపై కోసి గాయపరిచాడు. క్షతగాత్రులను స్థానికులు ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు.
ఎస్‌ఐ సురేష్‌కు సమాచారం అందడంతో ఆయన హుటాహుటిన గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు శివను అరెస్టు చేసి జైలుకు పంపించారు.