Visakhapatnam, February 4: విశాఖ జిల్లాలో విషాద ఘటన జరిగింది. చేప దాడిలో మత్స్యకారుడు మృతి ( Fisherman Killed in Attack by Huge Black Marlin Fish) చెందాడు. పరవాడ మండలం ముత్యాలపాలెంలో మత్స్యకారుడు జోగన్న చేపల వేటకు వెళ్లాడు. చేపలు పడుతున్న సమయంలో ఒక్కసారిగా జోగన్నపై కొమ్ముకోణం రకానికి చెందిన చేప దాడి చేసింది. విశాఖపట్టణం జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం తీరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. ముత్యాలమ్మపాలెం పంచాయతీ శివారులోని జాలరిపేటకు చెందిన నొల్లి జోగన్న (45), ఒలిశెట్టి అప్పలరాజు, ఒలిశెట్టి కొర్లయ్య, ఒలిశెట్టి ముత్తురాజు, కాంబాల చినదేముడు, కంబాల మహేశ్ కలిసి ఆదివారం సాయంత్రం ఇంజిన్ బోటుపై సముద్రంలో ( Bay of Bengal off Vizag Coast) వేటకు వెళ్లారు. రాత్రంతా వేట కొనసాగించగా, సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో భారీ కొమ్ము కోనం చేప (మార్లిన్ ఫిష్) వారికి కనిపించింది. దీంతో దానికి గేలం వేసేందుకు జోగన్న సముద్రంలోకి దూకాడు. అదే సమయంలో చేప (Huge Black Marlin Fish) వేగంగా అతడిపైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో చేపకు ఉండే భారీ కొమ్ము జోగన్న కడుపులో దిగబడింది. తీవ్రంగా గాయపడిన జోగన్నను వెంటనే బోటులోకి చేర్చి తీరానికి బయలుదేరారు.
పుణెలో ఘోర ప్రమాదం, కుప్పకూలిన భవనం, 5 మంది కూలీలు అక్కడికక్కడే మృతి, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు
జోగన్నకు వెంటనే వైద్య సాయం అందాల్సిన వేళ తీరానికి చేరుకునేందుకు ఏడు గంటలకుపైగా సమయం పట్టడంతో పరిస్థితి విషమించి జోగన్న మృతి చెందాడు. కాగా, చేపదాడిలో మత్స్యకారుడు మృతి చెందడం ఇదే తొలిసారని జాలర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా చేప కొమ్ముకు ఉన్న విషం శరీరంలోకి ప్రవేశించడంతో మత్స్యకారుడు జోగన్న మృతి చెందాడని తెలుస్తోంది. మత్స్యకారుడి జోగన్న మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఈ పరిణామంతో విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లాలి అంటే మత్స్యకారులు భయపడుతున్నారు.