మహారాష్ట్రలోని పుణెలో​ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిన ఘటనలో 5 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. మృతి చెందిన వారంతా భవన నిర్మాణ కార్మికులని పోలీసులు పేర్కొన్నారు. పదిమంది కూలీలు పనిచేస్తుండగా ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. మిగతా ఇద్దరికి గాయాలు అయినట్లు పేర్కొన్నారు. గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)