Amaravati, May 28: హైదరాబాద్, బెంగళూరులాంటి మహా నగరాలతో పోటీపడే సత్తా విశాఖకు మాత్రమే ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Ap Cm YS Jagan) తెలిపారు. విశాఖలో (Vizag) స్కిల్ డెవలప్‌మెంట్ కోసం అత్యున్నతస్థాయి ఇంజినీరింగ్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే మౌలిక సదుపాయాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) ప్రత్యేక బలం ఉందని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, విద్యా వ్యవస్థపై మూడో రోజు మన పాలన-మీ సూచన కార్యక్రమం, పలు విషయాలను ప్రసావించిన ఏపీ సీఎం
నాలుగవ రోజు మన పాలన-మీ సూచన కార్యక్రమంలో (Mana Palana-Mee Suchana Day 4) భాగంగా గురువారం పారిశ్రామిక రంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ అవకాశాల పెంపుపై సీఎం జగన్ చర్చించారు. పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు.
ఎప్పటికైనా ప్రత్యేక హోదాను సాధించి తీరుతాం
రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని,లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని సీఎం గుర్తు చేశారు. ఏపీ సీఎం మాట్లాడుతూ..రాష్ట్ర విభజనతో మనకు నష్టమే జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తారని మాట ఇచ్చి ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే అనేక రాయితీలు ఇచ్చేవారు.. పరిశ్రమలు వచ్చేవి. జీఎస్టీతోపాటు అనేక పన్నుల్లో మినహాయింపులు వచ్చేవి. 2014-19 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేసినా హోదా రాలేదు.Mee Suchana Day 2: రైతులు, కూలీల్లో చిరునవ్వును చూడటమమే లక్ష్యం, రైతులకు మరిన్ని పథకాలు అందిస్తామని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్
కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ రాకపోయి ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం జరిగి ఉండేది. ప్రత్యేక హోదా ఇస్తే ఎవరితోనైనా కలిసిపోతామని ఆనాడే చెప్పాం. కానీ కేంద్రంలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడు అవకాశం వచ్చినా కేంద్రంతో ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉన్నాం. ఎప్పటికైనా ప్రత్యేక హోదాను సాధించి తీరుతామని చెప్పారు.
Here's AP CMO Tweet
మనం ఏదైనా చెబితే ఆ మాటల్లో నిజాయితీ ఉండాలి. ఆ మాటల్లో నిబద్ధత ఉండాలి. నేను చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పలేను.
- సీఎం వైయస్ జగన్. pic.twitter.com/reX5IMRit7
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 28, 2020
మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి
మనం చెప్పే మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి. గత ప్రభుత్వం మాదిరిగా నేను అబద్ధాలు చెప్పను. గత ప్రభుత్వం రూ.20 వేల కోట్ల పెట్టుబడులు, 40 లక్షలు ఉద్యోగాలంటూ ప్రచారం చేసింది. అన్ని విదేశీ సంస్థలు వచ్చేస్తున్నాయని ప్రచారం చేశారు. 2014-19 వరకు రూ.4వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం డిస్కంలకు రూ.20వేల కోట్ల బకాయిలు పెట్టిందని ఏపీ సీఎం అన్నారు. ఏపీకి 972 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది..మంచి రోడ్డుమార్గం, రైల్వే కనెక్టవిటీ ఉంది. నాలుగు పోర్టులు, ఆరు ఎయిర్‌పోర్టులున్నాయి. మన పాలన – మీ సూచనలో ఏపీ సీఎం వైయస్ జగన్, మే 30వ తేదీ వరకూ జరగనున్న కార్యక్రమం, ఈ ఏడాది పథకాల క్యాలండర్ ఇదే
గత ప్రభుత్వం రాయితీలను కూడా అమ్ముకుంది.. కానీ ఈ ప్రభుత్వంలో అవినీతికి తావులేదు. వ్యవస్థల్లో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడాలేని విధంగా జ్యుడిషీయల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు చేశాం. రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాం. దీని ద్వారా పారదర్శకత పెరిగింది. దేశంలోనే అత్యున్నత పోలీసు వ్యవస్థ ఇక్కడ ఉందని తెలిపారు.
మరిన్ని పెట్టుబడులతో కియా
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు కియా సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలో మరో 54 మిలియన్ డాలర్లు అదనంగా పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆ సంస్థ కూకున్ షిమ్ వెల్లడించారు. కియా ఎస్‌యూవీ వెహికల్స్ తయారీకి ఈ కొత్త పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు.
Here's Kia statement on investing further in Andhra Pradesh
CEO & Managing Director of @KiaMotorsIN Kookhyun Shim has issued a statement on investing further in Andhra Pradesh. An additional $54 million will be invested to manufacture SUV vehicles. This was announced in the “Mana Palana-Mee Suchana “ program. pic.twitter.com/0FEq3ISbPe
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 28, 2020
మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా గురువారం పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కియాకు బలమైన బంధం ఉందని కూక్యూన్ తెలిపారు.
పరిశ్రమలు పెట్టేందుకు 1466 కంపెనీలు సిద్ధం
కొత్తగా 13,122 సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రావడమే కాకుండా, రూ. 11,500 కోట్లతో పరిశ్రమలు పెట్టేందుకు 1466 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఏపీ సీఎం అన్నారు. మరో 23 ప్రముఖ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 2014-19 వరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలతోపాటు.. సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కాపాడుకునేందుకు రూ.968 కోట్లు కేటాయించాం. మొదటి విడతగా రూ.450 కోట్లు విడుదల చేశాం. సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సుమారు రూ.1200 కోట్లు ప్యాకేజీ ఇచ్చాం. రూ.15వేల కోట్లతో కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు. స్టీల్‌ప్లాంట్ అభివృద్ధి కోసం ప్రైవేట్ కంపెనీలు ముందుకొస్తే... వారితో కలిసి పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.
ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదంపై వేగంగా స్పందించాం. రూ.50 కోట్లు విడుదల చేసి బాధితులకు 10 రోజుల్లోనే ఇచ్చాం. సంఘటన జరిగిన గంటలోపే అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వ కమిటీలు విచారణ జరుపుతున్నాయి. కమిటీల నివేదిక తర్వాత బాధ్యులెవరైనా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.