Srisailam, AUG 31: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని నంద్యాల(Nandyala) జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో(Srisailam) భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. 15 షాపులు దగ్ధం అయ్యాయి. శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ(Srisaila Mallikarjuna Swamy Temple) సమీపంలో ఉన్న లలితాంబికా దుకాణ సముదాయంలో(Lalitambika Shop Complex) గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు ఎల్ బ్లాక్ లోని మిగిలిన షాపులకు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
మంటల్లో షాపింగ్ కాంప్లెక్స్! | Srisailam - TV9#Srisailam #fireaccident #tv9telugu pic.twitter.com/es9VVML0QG
— TV9 Telugu (@TV9Telugu) August 31, 2023
అయితే అప్పటికే 14 షాపులు దగ్ధం అయ్యాయి. మంటలు ఇతర షాపులకు విస్తరించకుండా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా, షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు నిర్ధారించారు. అగ్ని ప్రమాదం ధాటికి సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.