Ambati Rambabu vs Pawan Kalyan (Photo-File Image)

Vijayawada, NOV 26: చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై (pawan Kalyan) నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu). వారిపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ కు ఏపీతో ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. నువ్వు పవన్ కల్యాణ్ కాదు కిరాయి కల్యాణ్.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనలో (Fishing Harbour Fire Incident) ముఖ్యమంత్రి జగన్ చాలా వేగంగా స్పందించారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బాధితులు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారాన్ని అందజేసిందన్నారు. ఇంత స్పీడ్ గా స్పందించిన ప్రభుత్వం.. దేశంలో ఎక్కడా లేదని అనేకమంది కొనియాడారని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.

 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అఘమేఘాల మీద వచ్చి ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) మీద విమర్శలు చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్ కారణం అంటూ పవన్ మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. ఆఖరికి తన నాల్గవ భార్య విడాకులకు కూడా జగన్ కారణం అనే విధంగా పవన్ వ్యవహార శైలి ఉందని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్.. స్పెషల్ ఫ్లైట్స్ లో వచ్చినా.. నష్టపరిహారం ఇచ్చినా అది ప్యాకేజీ డబ్బే అని ఆరోపించారు. అసలు.. ఏపీకి పవన్ కల్యాణ్ కి సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు మంత్రి అంబటి.

”ప్యాకేజీ తీసుకుని అప్పుడప్పుడు వచ్చి ముఖ్యమంత్రి జగన్ మీద విమర్శలు చేసి వెళ్లిపోతావు. నీకు, ఏపీకి ఎలాంటి సంబంధం లేదు. పవన్ ది బానిస బతుకు. చంద్రబాబు చెప్పులు మోస్తున్నావు. కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబుకి తాకట్టు పెట్టాలని పవన్ చూస్తున్నాడు. చంద్రబాబు పల్లకి మోయడానికి పవన్ రాజకీయాలు చేస్తున్నాడు. నీలాంటి వారిని కాపు సామాజికవర్గం నాయకుడిగా ఒప్పుకోదు.

PM Modi In Telangana: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. కాంగ్రెస్‌కు వేసిన ప్రతి ఓటు BRSకే వెళ్తుంది - ప్రధాని మోడీ 

కాపు జాతిని అమ్ముకుని బతకడానికే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. పవన్ కల్యాణ్.. నువ్వు నటుడివా? విటుడివా? ఏం బతుకు నీది? తెలంగాణలో బీజేపీ జెండా పట్టుకుంటాడు. ఇక్కడ తెలుగుదేశం జెండా మోస్తున్నాడు. పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీకి 2వ పెళ్లాంలా మారిపోయాడు. నువ్వు పవన్ కల్యాణ్ కాదు… కిరాయి కళ్యాణ్. నీ జీవితం మొత్తం చంద్రబాబు పల్లకి మోయడమే” అంటూ పవన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు.

ఇక తెలంగాణ రాజకీయాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. తెలంగాణ రాజకీయాల ప్రభావం ఏపీపై ఉండదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా ఏపీతో సత్సంబంధాలే ఉంటాయన్నారు. వారాహికి తెలంగాణలో లైసెన్స్ లేదనుకుంటా అన్న మంత్రి అంబటి.. చంద్రబాబు చెబితేనే పవన్ కల్యాణ్ వారాహి యాత్ర స్టార్ట్ చేశారని, అందుకే చంద్రబాబు డైరెక్షన్ లోనే వెళ్తోందని విమర్శించారు.