Vjy, Sep 13: టీడీపీ నుంచి సస్పెండ్ అయిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో కొత్త టిస్ట్ బయటకు వచ్చింది. బాధితురాలు వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కేసు దర్యాప్తునకు అవసరమైన ఆరు రకాల పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరణ పూర్తయిన తర్వాత వరలక్ష్మి నిన్న(గురువారం) డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తాళం వేసుకొని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.వరలక్ష్మి జాడ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆదిమూలం-వరలక్ష్మిల మధ్య రాజీ కుదుర్చేందుకు టీడీపీ నేతలు రహస్య మంతనాలు జరుపుతున్న సమయంలో వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.
ఈ రోజు ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆదిమూలంను టీడీపీ నుంచి సస్పెండ్ చేయగా.. విమర్శల నేపథ్యంలో కేసు నమోదు చేశారు పోలీసులు. వేధింపులు వీడియో వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన సత్యవేడు ఎమ్మెల్యే.. తాజా డిశార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు.
బాధితురాలి ఆరోపణల మేరకు తిరుపతి భీమా ప్యారడైజ్‌లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూములు సీజ్, సీసీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని అశ్లీల వీడియోను ఫారెన్సీక్ ల్యాబ్‌కు పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో శాసనసభ స్పీకర్ అనుమతి తీసుకొని ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు.