విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీ ప్రతినిధుల సభ విజయవంతంగా కొనసాగుతోందని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో నిన్న జరిగిన సభలో 1.68లక్షల మంది కార్యకర్తలు ప్లీనరీకి హాజరయ్యారని ప్రకటించారు. నేటి సభకు 4.5 లక్షల మందికిపైగా పార్టీ ప్రతినిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తథ్యమని తెలిపారు. అధికార దుర్వినియోగం ఎక్కడా జరగలేదు. చంద్రబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
పండగలా వైయస్ఆర్ సీపీ ప్లీనరీ
- ఉదయం నుండి వర్షాన్ని లెక్కచేయకుండా ప్లీనరీ ప్రాంగణానికి భారీగా చేరుకుంటున్న పార్టీ శ్రేణులు.
- రెండో రోజు సీఎం వైయస్ జగన్ ప్రసంగంపై సర్వతా ఆసక్తి..https://t.co/t6hbV4LmDf #YSJagan #YSRCPPlenary
— YSR Congress Party (@YSRCParty) July 9, 2022
ఈ రోజు ప్లీనరీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. వాతావరణాన్ని బట్టీ ..మాకు ఉన్న ప్లాన్ ఆఫ్‌యాక్షన్ ప్రకారం పార్టీ అధ్యక్షులు 4 గంటలకు ఉపన్యాసం చేస్తారు. వాతావరణాన్ని బట్టీ మధ్యాహ్నం 3 గంటలకు మార్చే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఇవాళ పార్టీ అధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది. ఆ తరువాత పార్టీ అధ్యక్షుల ముగింపు ప్రసంగం ఉంటుంది. నిన్న కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టాం. ఈ రోజు కొన్ని తీర్మానాలు ప్రవేశపెడుతామని చెప్పారు. మా ఫోకస్ అంతా కూడా విద్యా, వైద్యం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, మీడియా బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయాలన్నదే మా ఉద్దేశమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.