Amaravati, Jan 20: ఏపీలో అంతుచిక్కని వ్యాదులు కలకలం రేపుతున్నాయి. ఏలూరులో మిస్టరీ వ్యాధి ప్రకంపనలు మరచిపోకముందే మరో సంఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలో అంతుచిక్కని వ్యాధి కలకలం (Mysterious illness in Pulla village) రేపింది. భీమడోలు మండలంలోని పూళ్ల గ్రామంలో కొందరు స్పృహ తప్పి పడిపోతుండడంతో బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు మరో ఇద్దరు అస్వస్థతకు (Mysterious illness in Andhra) గురి కావడంతో బాధితుల సంఖ్య 28కు చేరిందని అధికారులు తెలిపారు.
ఈ వ్యాధి కారణం ఏమిటో తెలియక అక్కడి ప్రజలు ( Pulla village) ఆందోళన చెందుతున్నారు. నీటి కాలుష్యం కానీ, లేదా అక్కడి ప్రజలకు అందుతోన్న కూరగాయలపై వాడే పురుగుల మందువల్ల వారు అస్వస్థతకు గురి అవుతుండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే వాటి శాంపిల్స్ ను తీసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు.
వాటి రిపోర్టులు వచ్చిన తర్వాత ఈ వింత వ్యాధి ఏంటో తెలుస్తుందని వివరించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గోరు వెచ్చని నీరు తాగాలని, కూరగాయాలు శుభ్రం చేసి వండుకోవాలని సూచిస్తున్నారు. కూరగాయలు కూడా నీళ్లలో 30 నిముషాలపాటు ఉంచాలని, తర్వాత శుభ్రం చేసి వండుకోవాలన్నారు. ఇదిలా ఉంటే గతంలోనూ ఏలూరులో వింత వ్యాధితో వందల మంది ఆసుపత్రుల పాలైన విషయం తెలిసిందే.