Nara Brahmani On CBN Arrest

Rajamahendravaram, SEP 16: టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే ఆరాటపడేవారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ఆయన చేసిన తప్పా అని ఆయన కోడలు నారా బ్రాహ్మణి (Nara Brahmani) ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేసి, రిమాండ్ లో ఉంచడంపై ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ ఏపీలోని రాజమండ్రిలో (Rajamahendravaram) కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన ఒక విజనరీ అని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చంద్రబాబుకు (Chandrababu) మద్దతు ఇస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు కుటుంబానికి దూరంగా ఉంటూ నిరంతరం ప్రజల కోసం కష్టపడ్డారని అన్నారు.

Here's Video

అంతగా శ్రమించిన చంద్రబాబుని ఎటువంటి ఆధారాలూ లేకుండా అరెస్ట్ (CBN Arrest) చేశారని అన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యురాలిగానే కాకుండా ఓ యువతిగానూ చాలా బాధపడుతున్నానన్నారు. చంద్రబాబు నాయుడు ఏపీలో లక్షలాది మందికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణను ఇప్పించారని అన్నారు.

 

మన యువతకు బడా కంపెనీల్లో ఉద్యోగాలు రావడానికి మార్గం సుగమం చేశారని తెలిపారు. ఇన్ని మంచి పనులు చేయడం నేరమా? అని అన్నారు. తమకు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందని, చంద్రబాబు నాయుడు త్వరలోనే విడుదలవుతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ గెలిచి, అభివృద్ధికి బాటలు వేస్తారని అన్నారు.