 
                                                                 Mumbai, OCT 07: ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ (Bandaru Satyanarayana) చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ రాణా (Navneet Kaur) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నటీమణులు రాధిక, ఖుష్బూ కూడా స్పందించి రోజాకు (Roja) మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. నవనీత్ కౌర్ రాణా ఓ వీడియో రూపంలో మాట్లాడుతూ… రోజాపై ఇంతలా దిగజారి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. అలా మాట్లాడిన వారికి భార్య, చెల్లి, కూతురు లేరా అని నిలదీశారు. తెలుగు రాష్ట్రాల్లో ఆడవారిని గౌరవిస్తారని చెప్పారు. టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన కామెంట్స్ మాత్రం మహిళల గౌరవాన్ని తగ్గించేట్లు ఉన్నాయని చెప్పారు.
— Navnit Ravi Rana (@navneetravirana) October 7, 2023
ఇలా రాజకీయాల కోసం సిగ్గులేకుండా మాట్లాడడం ఏంటని నిలదీశారు. తాను రోజాకు మద్దతుగా ఉంటానని అన్నారు. అలాగే, మహిళలు అందరూ రోజాకు అండగా ఉంటారని తెలిపారు. రోజా సినీ పరిశ్రమకు కూడా సేవలు అందించారని అన్నారు. చాలా మంది హీరోలతో కలిసి నటించారని చెప్పారు. రోజాను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని, బండారు సత్యనారాయణ తన కామెంట్లను వెనక్కి తీసుకుని, క్షమాపణలు చెప్పాలని నవనీత్ కౌర్ డిమాండ్ చేశారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
