Visakhapatnam, June 28: చేసేది నేవీ ఉద్యోగం..అయితే విలాసాలు అలవాటయ్యాయి. ఉమ్మడి కుటుంబం ఖర్చులు ఎక్కువుంటాయని తెలియకుండా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాడు. చివరకు నిండా మునిగి ఏం చేయాలో తెలియక దొంగతనానికి పాల్పడ్డారు, చివరకు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఘటన వివరాల్లోకెళితే.. బిహర్‌కు చెందిన రాజేష్ ఇండియన్ నేవీలో సైలర్‌గా (Navy sailor) పనిచేస్తున్నాడు. ఇతను అమ్రిత పూనమ్ అను యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. విశాఖపట్నంలో సైలర్ గా పనిచేస్తున్నాడు.
రాజేష్‌ది ఉమ్మడి కుటుంబం. అక్క, చెల్లెలు, అమ్మ నాన్నతో కలిసి ఏడుగురు సంతానం. వీరందరూ ఒకే ఇంట్లో ఉండటంతో ఖర్చులు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఇటీవల షేర్ మార్కెట్లో చాలావరకు డబ్బు పోగొట్టుకున్నాడు. మొత్తంగా దాదాపు 10 లక్షలు అప్పులు పాలయ్యాడు. ఈ దశలో విశాఖ నుంచి ముంబైకి బదిలీ అయింది. అప్పుల బెడద తీవ్రం కావడంతో రాజేష్ తప్పుడు ఆలోచనలు చేశాడు. గోపాలపట్నం సమీపంలో ఉన్న శ్రీ జ్యుయలరీలో చోరీకి పాల్పడ్డాడు.
మొత్తం 4.50 కిలోల వెండి, 90 వేల నగదు, కొంత బంగారు నగలు చోరీ చేశాడు. ఈ చోరీ సొత్తును నేరుగా ఇంటికి తీసుకు వెళ్ళకుండా ఎయిర్‌పోర్టు సమీపంలోనే ఉన్న పొదలో దాచారు. అయితే బంగారు దుకాణంలో చోరీపై విచారణ చేసిన పోలీసులకు సీసీఫుటేజ్‌లో రాజేష్ అతని భార్య ఇద్దరు ఉన్నట్లు ఆనవాళ్లు కనపడ్డాయి. దీంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని (Navy sailor arrested for theft of jewellery) విచారణ చేపట్టారు.