AP PRC (Photo-Video grab)

విజయవాడ, జనవరి 30: ఆంధ్రప్రదేశ్ లో ట్రెజరీ ఉద్యోగులు నేడు కూడా పనిచేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ట్రెజరీ కార్యాలయాల సిబ్బంది ఆదివారం కూడా పనిచేయాలని, జీతాల బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వాట్సప్ ల ద్వారా ఉద్యోగులకు సమాచారం అందించింది. ప్రభుత్వం జీతాల చెల్లింపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని ఇప్పటికే ట్రెజరీ ఉద్యోగులకు, డీడీవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. జీతాల బిల్లులు మాత్రమే కాకుండా ఇతర శాఖల నుంచి వచ్చిన బిల్లులను కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.