AP Education Minister Adimulapu Suresh (Photo-ANI)

Amaravati, Jan 20: ఏపీలో పాఠశాలలకు సెలవులిచ్చే విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ (No plan to extend holidays) స్పందించారు. ఇటు పీఆర్సీపై ఉద్యోగుల ఆందోళనలపైనా ఆయన మాట్లాడారు. గుంటూరు వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ తో కలిసి ఆయన ఇవాళ ఆన్ లైన్ విద్యావిధానాన్ని ప్రారంభించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీలో ఉద్యోగులు పీఆర్సీకి (PRC) అంగీకరించారని.. మళ్లీ ఇప్పుడు ఆందోళన చేయడం సరికాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (Education Minister Adimulapu Suresh) అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇబ్బందులుంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చన్నారు. రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు. కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందన్నారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా తీవ్రత అంతగా లేదని చెప్పారు. బడులకు సెలవులను ఇచ్చే ఆలోచన ఇప్పటికైతే లేదని తేల్చి చెప్పారు. పిల్లలకు కరోనా సోకితే.. ఆ పాఠశాల వరకే సెలవు ప్రకటించి శానిటైజ్ చేశాక మళ్లీ తెరుస్తామని స్పష్టం చేశారు. కొన్ని యూనివర్సిటీలు పరీక్షలను కూడా నిర్వహిస్తున్నాయని, కోర్టు కూడా అందుకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. కొత్త కోర్సులను తీసుకొస్తున్నామని తెలిపారు. భవిష్యత్ కోసం ఆన్ లైన్ విద్యావిధానం తప్పనిసరి అని అన్నారు.

కరోనా లేకపోతే రాష్ట్ర రెవెన్యూ రూ.98 వేల కోట్లు ఉండేది, పీఆర్సీ ఆలస్యం అవుతుందనే ఐఆర్‌ ఇచ్చామని తెలిపిన ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ సమీర్‌ శర్మ, సమ్మెకు సిద్దమవుతున్న ఉద్యోగ సంఘాలు

ఇక సీఎంతో సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా నూతన పీఆర్సీకి అంగీకారం తెలిపారని, అలాంటిది ఇప్పుడు మళ్లీ ఆందోళనలు చేయడం సబబు కాదని ఆయన అన్నారు. ఇబ్బందులుంటే ప్రభుత్వంతో చర్చించవచ్చని సూచించారు. ఇప్పుడు ఆందోళనలు చేయాల్సిన అవసరమేంటని మంత్రి ప్రశ్నించారు.