Tanuku Town, February 14: ఉభయ గోదావరి జిల్లాల్లో వేల సంఖ్యలో చనిపోతున్న కోళ్లతో (Poultry) అటు పౌల్ట్రీ-ఫామ్ యజమానులతో పాటు సాధారణ ప్రజలను కూడా భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఒకవైపు చైనా ద్వారా వ్యాపిస్తున్న కోవిడ్19 వైరస్ (COVID-19) కలవర పెడుతుండగా, ఇప్పుడు వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో మరేదైనా కొత్త వైరస్ సోకిందా అని జనం ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో కోళ్లకు కరోనావైరస్ సోకి చనిపోతున్నాయి, చికెన్ తింటే మనుషులకూ కరోనావైరస్ సంక్రమిస్తుందనే పుకార్లు తూర్పుగోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో (Tanuku Town) వ్యాపించాయి. ఈ పుకార్లు ఇరుగు పొరుగు గ్రామాలకు పాకి మొత్తం ఉభయగోదావరి జిల్లాలకు వ్యాపించాయి.
తణుకు పట్టణంలో నాన్- వెజ్ బంద్ కు పిలుపునిచ్చారు. తణుకు అసెంబ్లీ ఎమ్మెల్యే కరుమూరి వెంకటనాగేశ్వరరావు పట్టణంలో ‘ నో నాన్-వెజ్ వీక్’ ప్రకటించారు. పౌల్ట్రీ ఫామ్స్‌లోని వేలాది కోళ్ళకు ప్రాణాంతక వైరస్ సోకింది, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక వారం నాన్-వెజ్ హాలిడే ప్రకటించాము" అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చికెన్ తింటే అంతే, కొనసీమలో మూగజీవాలను అటాక్ చేస్తున్న హెర్సిస్ వైరస్
తూర్పు గోదావరి జిల్లాలోని, అలమురు మండలం, బడుగువానిలంక వద్ద వైరస్ సోకి సుమారు 2,500 పైగా కోళ్లు చనిపోయాయి. ఈ ఘటన పుకార్లు వ్యాపించడానికి కారణమైంది. కాగా, ఆ కోళ్లు వైరులెంట్ న్యూకాజిల్ డిసీజ్ (VND- Virulent Newcastle Disease) వైరస్ సోకి చనిపోయినట్లు పశువైద్యాధికారులు పేర్కొన్నారు. వైరస్ సోకిన కోళ్లను తినొద్దని వారు హెచ్చరిస్తున్నారు.