Vijayawada, Feb 2: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో దారుణం జరిగింది. ఆసుపత్రిలో (Hospital) చేరిన రోగి (Patient) బంధువులపై అదే దవాఖాన సిబ్బంది దాడికి పాల్పడ్డారు. పూర్తివివరాల్లోకి వెళ్తే, ఆయాసంతో ఇబ్బంది పడుతున్న ఓ పేషెంట్ స్థానికంగా ఉన్న స్మైలీ ఆసుపత్రిలో చేరారు. పేషెంట్ ను హాస్పిటల్ లో చేర్చుకున్న వైద్యులు చికిత్స అందించారు. అయితే, గంటలతరబడి చికిత్స అందించినప్పటికీ పేషెంట్ సాధారణ స్థితికి రాలేదు. దీంతో డబ్బులు తీసుకున్నప్పటికీ పేషెంట్ కు సరైన ట్రీట్మెంట్ అందించలేదని డ్యూటీ డాక్టర్ ను రోగి తరుఫు బంధువులు ప్రశ్నించారు.
ఐర్లాండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం.. పూర్తి వివరాలు ఇవిగో..
Here's Video:
పేషంట్ బంధువులపై ఆసుపత్రి సిబ్బంది దాడి..
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని స్మైలీ ఆసుపత్రి వద్ద ఘటన
ఆయాసంతో ఇబ్బంది పడుతున్న పేషెంట్ కు సరైన ట్రీట్మెంట్ అందలేదని డాక్టర్ ను ప్రశ్నించిన బంధువులు
పేషంట్ బంధువులపై దాడికి దిగిన ఆసుపత్రి సిబ్బంది
ప్రశ్నిస్తే మాపై దాడి చేయడం… pic.twitter.com/66W9RbxrZC
— BIG TV Breaking News (@bigtvtelugu) February 2, 2025
ప్రశ్నిస్తే, దాడులా??
నన్ను ప్రశ్నిస్తారా? అంటూ అంతెత్తున లేచిన ఆ డాక్టర్, ఆయన తరుఫు సిబ్బంది పేషెంట్ బందువులపై మండిపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఒకింత సహనం కోల్పోయిన ఆసుపత్రి సిబ్బంది పేషెంట్ బంధువులపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రశ్నిస్తే మాపై దాడి చేయడం ఏంటని ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన చేపట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.