Representative Image (Photo Credit- PTI)

Vijayawada, Feb 2: ఐర్లాండ్‌ (Ireland) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ దుర్ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. మృతులను పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేశ్‌, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్‌ గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి సాయిబాబా పెద్ద కుమారుడు భార్గవ్‌ (25)ను ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం ఐర్లాండ్‌ కు పంపించారు. అక్కడ కార్లోలోలని సౌత్‌ ఈస్ట్‌ టెక్నాలజికల్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్నారు. అలాగే పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన చెరుకూరి రామకోటయ్య పెద్దకుమారుడు సురేశ్‌ (26) ఉన్నత చదువుల కోసం ఏడాది కిందట ఐర్లాండ్‌ కు వెళ్లారు.

మంగళగిరి కొండపై మంటలు.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఘోరం.. వ్యాపించిన దావానలం.. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమన్న ప్రజలు.. అనూహ్యంగా వాటంతట అవే ఆరిపోయిన మంటలు.. పానకాల లక్ష్మీనృసింహస్వామి మహిమేనంటున్న భక్తులు (వీడియో)

అలా మిత్రులు

ఒకే రాష్ట్రంవాళ్లు కావడంతో వీరిద్దరూ అక్కడే స్నేహితులయ్యారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి వీరిద్దరూ మరికొంతమంది స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లారు. ఆ సమయంలో భారీగా మంచు కురవడంతో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారుతో సహా వారు లోయలో పడిపోయారు. ఈ ప్రమాదంలో భార్గవ్‌, సురేశ్‌ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. కాగా, విద్యార్థులు మృతదేహాలను స్వస్థలాలకు తీసుకురావడానికి అధికారులు, స్థానిక నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. విద్యార్థులు మరణంతో గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, కుల గణన నివేదికను సభ ముందు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం