Pawan Kalyan On Tollywood Heros: ప్రభాస్, మహేష్ బాబు నాకంటే పెద్ద హీరోలు, మేమంతా ఒక్కటే! మీరెందుకు కొట్టుకొని చస్తారు?   టాలీవుడ్ హీరోలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan On Tollywood Heros (PIC@ FB)

Kakinada, June 22: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ సారి ఎలాగైనా తన జనసేన(Janasena) పార్టీని గెలిపించుకోవాలని, కొంతమంది ఎమ్మెల్యేలైనా గెలవాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయ యాత్రలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర(Varahi Yatra) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ముమ్మడివరంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో రోజూ మాట్లాడే పొలిటికల్ స్పీచ్ లతో పాటు సినిమా హీరోల గురించి కూడా మాట్లాడారు. పవన్ నిన్న ముమ్మడివరం జరిగిన సభలో మాట్లాడుతూ.. నాతో కొంతమంది చెప్తారు మీ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ (NTR Fans) గొడవపడతారు ఎప్పుడూ అని నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ (Mahesh babu) గారు, బాలకృష్ణ (Balakrishna) గారు, అల్లు అర్జున్ (Allu Arjun) గారు, చిరంజీవి గారు.. ఇలా అందరు హీరోలు ఇష్టం, గౌరవం. మేము కనపడితే మాట్లాడుకుంటాం. మేము అందరం బాగానే ఉంటాం. సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమాలు ఇష్టపడితే మీరు ఏ హీరోని అయినా ఇష్టపడండి. కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాత్రం నా మాట వినండి.

ఒక్కసారి ప్రభాస్ (Prabhas) గారు, మహేష్ గారు నా కంటే పెద్ద హీరోలు. వాళ్ళు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. పాన్ ఇండియా హీరోలు వాళ్ళు. రామ్‌ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్లిపోయారు. ప్రపంచమంతా వాళ్ళు తెలుసు. నేను ప్రపంచం అంతా తెలియదు. నాకు ఇలా చెప్పడానికి ఎలాంటి ఈగోలు లేవు. నాకు ఒక సగటు మనిషి బాగుండాలి. కులాలు, హీరోల పరంగా కొట్టుకోవద్దు అని వ్యాఖ్యానించారు.

Mudragada Letter to Pawan Kalyan: లెటర్ ఇదిగో, ఇప్పటి వరకు ఎంత మంది తాట తీశావో చెప్పు, పవన్ కళ్యాణ్‌కి ఘాటు లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం 

దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ గా మారాయి. ఒక స్టార్ హీరో అయి ఉండి ఇలా ఎవరూ మాట్లాడారు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు, తనకంటే చిన్న హీరోలకు కూడా గౌరవం ఇచ్చి మాట్లాడతాడు, వేరే హీరోలు ఎంత ఎదిగినా జెలసీ లేదు.. ఇలా పలు కామెంట్స్ చేస్తూ పవన్ ని అభినందిస్తున్నారు. వేరే హీరోల అభిమానులు కూడా ఈ వ్యాఖ్యలకు పవన్ ని అభినందిస్తున్నారు.