నరసాపురం, ఫిబ్రవరి 20 : అధికార వైసీపీ పిచ్చి పిచ్చి వేషాలకు జనసేన భయపడబోదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ‌్ హెచ్చరించారు. సంయమనం పాటిస్తున్నామంటే అతి పిరికితనం అనుకోవద్దన్నారు. జనసైనికుల పై అక్రమ కేసులు బనాయిస్తే రోడ్డు మీదకు వచ్చి తెగించి పోరాడతానని పవన్ అన్నారు. భయం అంటే ఏంటో వైసీపీ నాయకులకు చూపిస్తానని అన్నారు. 217 జీవోతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు.
అందుకే మత్స్యకారులకు అండగా నిలిచేందుకు యాత్రగా ప్రారంభించి నరసాపురంలో ముగించామన్నారు. ఏపీలో రోడ్లన్నీ అద్వాన్నంగా మారాయన్నారు. 32 మత్స్యకార కులాలు తీరప్రాంతంలో జీవనం సాగిస్తున్నారన్నారు. దాదాపు అరవై లక్షల మంది ఉన్నారన్నారు. సముద్రంపై ఆధారపడి 557 మత్స్యకార గ్రామాలున్నాయని పవన్ చెప్పారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో మత్స్యకారులకు అండగా నిలబడతానని చెప్పారు.
Janasena peoples party 💓😘😘😘💥 pic.twitter.com/U8pFuSWE2y
— ᵇʰᵉᵉᵐˡᵃⁿᵃʸᵃᵏᵒⁿᶠᵉᵇ25 (@_ManishReddy) February 20, 2022
217 జీవో మత్స్యకారుల పొట్ట కొడుతుందన్నారు. ఇష్టం లేని చట్టం, దోపిడీ చేసే చట్టం, కష్టాన్ని దోచే చట్టాన్ని ఎదిరించాలన్నారు. ఈ సందర్భంగా ఆ జీవోను పవన్ కల్యాణ్ సభలో చించి తన నిరసనను తెలియజేశారు. వంగి వంగి దండాలు పెట్టడానికి తాను రాజకీయాలలోకి రాలేదన్నారు. సమస్యను సృష్టించేది వైసీపీయే.... సమస్యను వైసీపీయే సృష్టిస్తుందని, దానిని పరిష్కరించడంలో కాలయాపన చేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. ఒక్క మాట మాట్లాడాలంటే తాను చాలా ఆలోచించి మాట్లాడతానని చెప్పారు. తాను చట్టాలను నమ్ముతాను కాని దోపిడీ చేసే చట్టాలను అదే స్థాయిలో వ్యతిరేకిస్తానని చెప్పారు.
వైసీపీ నాయకులు ఎటూ బ్రాందీ అమ్ముతున్నారు కాబట్టి చీకుల కొట్టు కూడా పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. మటన్, చికెన్ కొట్లు నడపటానికి అధికారం ఇవ్వలేదన్నారు. పాదయాత్ర చేసింది చేపల దుకాణాలు పెట్టుకోవడానికా? అని ప్రశ్నించారు. నిలబెట్టుకోలేని హామీలను ఎందుకిచ్చారన్నారు. పరోక్షంగా చిరంజీవి జగన్ భేటీని ఉద్దేశిస్తూ ఎంత పెద్ద స్థాయి వ్యక్తులయినా వైసీపీ నేతల ఎదుటకు వచ్చి మోకరిల్లాలని పవన్ కల్యాణ్ అన్నారు.
అంత ఇగో ఎందుకు అని ప్రశ్నించారు. పరోక్షంగా ఇటీవల చిరంజీవి టాలీవుడ్ టాక్స్ లో జగన్ ను అభ్యర్థించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, రాచరికం కాదని పవన్ కల్యాణ్ అన్నారు. తాను చావడానికైనా సిద్ధపడతాను కాని, తలవంచడానికి ఇష్టపడను అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మత్స్యకారుల కోసం ప్రత్యేక మ్యానిఫేస్టో పెడతామని చెప్పారు. తనకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.