Chandrbabu Naidu: చంద్రబాబు కుప్పం సభకు అనుమతి నిరాకరణ, నోటీసులకు వివరణ ఇవ్వనందుకు పర్మిషన్‌ ఇవ్వడంలేదంటూ ప్రకటన
Chandra Babu Naidu (Photo/Twitter/TDP)

Chittoor, JAN 04: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) నేటి నుంచి మూడో రోజుల పాటు కుప్పం (Kuppam) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనలో రోడ్ షో, సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. చంద్రబాబు పర్సనర్ సెక్రటరీకి మంగళవారమే నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు. రాత్రి 10.30 గంటల వరకు సరైన సమాధానం రాలేదన్నారు. అందుకే రోడ్ షో, సభలకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా సభలు నిర్వహించినా, అందులో పాల్గొన్నా.. చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

YSRCP Coordinators For Constituencies: పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఆమంచి కృష్ణమోహన్‌ నియామకం, రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ  

అంతకముందు చంద్రబాబు పర్యటనపై (Chandrababu Tour) పలమనేరు డీఎస్పీ నోటీసులు ఇచ్చారు. జీవో నెం.1 ప్రకారం సభలపై ముందుస్తు సమాచారం ఇవ్వాలన్నారు. ఇరుకు సందుల్లో, నేషనల్ హైవేలపై సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సభలు, రోడ్ షోల వివరాలను అందించాలని సూచించారు. దీనిపై పోలీసులను టీడీపీ నేతలు..చంద్రబాబు పర్యటనపై వివరాలు అందించారు. అయితే చంద్రబాబు వ్యక్తి గత కార్యదర్శికి ఇచ్చిన నోటీసుపై సమాధానం ఇవ్వడం ఆలస్యమైందని రోడ్ షోలు, సభలకు పోలీసులు అనుమతి నిరాకరించారు.