కచ్చిడి చేప ( Image: Twitter)

అంతర్వేది, మార్చి 12 : కచ్చిడి చేప పేరు చెబితేనే మత్స్యకారులు పండగ చేసుకుంటారు. ఈ చేప వలకు చిక్కిందంటే మత్స్యకారులు తమకు బంగారం దొరికినట్లే భావిస్తారు. ఇది అత్యంత అరుదుగా చిక్కుతుంది. దీని ధర కూడా లక్షల్లోనే ఉంటుంది. మత్స్యకారులు ఈ రకం చేప తమ వలలో పడితే పంట పండినట్లే అని భావిస్తుంటారు. ఒకసారి కచ్చిడి చేప వలకు చిక్కిందంటే.. రూ.60 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ధర పలుకుతుంది. అందులోనూ ఆడ చేప కంటే, మగ చేపకు ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంటుందట. కచ్చిడి చేప పొట్టలో ఉండే తిత్తులను మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తారట. సర్జరీ చేశాక కుట్లు వేసేందుకు వాడే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్ తో తయారు చేస్తారని మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. ఖరీదైన వైన్ తయారీలోనూ ఈ చేప శరీర భాగాలను వినియోగిస్తారట. అందుకే ఈ కచ్చిడి చేపను గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తారు.

జమ్ముకశ్మీర్‌లో కూలిపోయిన ఆర్మీ చీతా హెలికాప్టర్‌, పైలట్‌, కో పైలట్‌ పారాచూట్‌ ద్వారా బయటపడినట్లు వార్తలు, వారిని గాలిస్తున్న ఆర్మీ రెస్క్యూ బృందాలు

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ లో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 26 కిలోల కచ్చిడి చేప చిక్కింది. దానిని అమ్మకానికి పెట్టగా.. పాలకొల్లు వ్యాపారులు రూ.79 వేలకు కొనుగోలు చేశారు. తర్వాత ఆ చేపను కలకత్తాలోని ఎక్స్ పోర్ట్ సెంటర్ కి లక్షన్నర విక్రయించాడు. అక్కడి నుంచి ఈ చేప చైనాకు ఎగుమతి అవుతుంది. అక్కడ దాని ధర దాదాపు 5 లక్షల దాకా పలికే చాన్స్ ఉంది. ఇలాంటి చేప ఒక్కటి వలలో చిక్కినా తమ పంట పండినట్టే అని మత్స్యకారులు చెబుతుంటారు. కాగా ఈ చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదు. ఒక చోట నుంచి మరో చోటికి ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుంది. అందుకే వలకు చిక్కడం అరుదు.