Vijayawada, DEC 02: ఫుల్ మీల్స్ తినాలంటే ఇప్పుడున్న రోజుల్లో కనీసం వంద రూపాయలు కావాలి. అలా కాదంటే ప్రభుత్వం సబ్సిడీ మీద అందించే భోజనం తినాలంటే కూడా రూ.5 కావాలి. కానీ విజయవాడలో ఓ హోటల్ యజమాని (restaurant) పెట్టిన ఆఫర్ అందరినీ ఆశ్చర్య పరిచింది. కేవలం ఐదు పైసలకే ( 5 paise) 35 రకాల వంటలతో భోజనం పెడతానంటూ ప్రకటించాడు. 5 పైసల కాయిన్ తీసుకొస్తే రూ.400 విలువచేసే శాకాహార భోజనం (Veg meals) ఉచితంగా తినొచ్చని తెలిపాడు. 35 రకాల వంటకాలు రుచిచూడొచ్చని ప్రకటించింది. 5 పైసల కాయిన్స్ ఇప్పట్లో ఎవరి దగ్గర ఉంటాయని అందరూ అనుకున్నారు. అయితే, ఆ రెస్టారెంటుకు 5 పైసల కాయిన్స్ ( 5 paise coin) పట్టుకుని వచ్చిన వారిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ హోటల్ కు భారీగా జనాలు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Veg thali @ 5paisa
విజయవాడలో ఒక ప్రముఖ హోటల్ లో రూ. 400 విలువగల వెజ్ తాలి పాత 5 పైసల కాయిన్ తీసుకొస్తే ఫ్రీ గా పెడతామని ఇచ్చిన ప్రకటనకి ఉదయం 9 గంటలనుంచే వెల్లువెత్తిన జనాలు…. pic.twitter.com/EBMpPfDwdK
— Rakesh Reddy (@rakeshreddylive) December 2, 2022
5 పైసలు పట్టుకుని రాజ్ భోగ్ రెస్టారెంటు ముందుకు వచ్చిన జనాలు లోపలికి వెళ్లేందుకు ఎగబడ్డారు. ఇంత మంది భోజనం చేసేందుకు వస్తారని తాము ఊహించలేదని ఆ రెస్టారెంటు యజమాని మీడియాకు తెలిపారు. దాదాపు 300-400 మంది కస్టమర్లు వస్తారని తాము అనుకుంటే 1,000 మంది కంటే ఎక్కువ కస్టమర్లు వచ్చారని చెప్పారు.
తాము మొదట వచ్చిన 50 మందికి మాత్రమే 5 పైసలకు భోజనం అందించామని, మిగతా అందరికీ సగం ధరకే (రూ.200) ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు తమ రెస్టారెంటు బాగా ఫేమస్ అయిపోయిందని సంబరపడిపోయారు. రాజస్థానీ, గుజరాతీ, ఉత్తర భారత తాలీని తాము వడ్డించామని చెప్పారు.