Rains (File: Twitter)

Hyderabad, October 18: ఇప్పటికే తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రాలు వర్షాలతో (Heavy Rains) అల్లాడుతుండగా.. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.  తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను (Another Cyclone) ముప్పు పొంచి ఉండొచ్చని తాజాగా కెనడాకు చెందిన వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నేడు ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్టు వాళ్ళు అంచనా వేస్తున్నారు. దీంతో అక్టోబర్ 20 నాటికి అది తీవ్ర వాయుగుండంగా, ఆపై తుఫాన్‌గా మారనుందని చెప్పారు. దీనికి 'సిత్రాంగ్' అని పేరు పెట్టారు. సిత్రాంగ్ అంటే థాయ్ భాషలో 'వదలని' అని అర్ధం. సిత్రాంగ్ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో భారీగా వర్షాలు కురువనున్నాయట. అయితే, సిత్రాంగ్ ఏర్పడే ప్రమాదం లేదని ఐఎండీ చెబుతున్నది. ప్రజలేవరూ పుకార్లను నమ్మవద్దని సూచిస్తున్నది. అయితే, వర్షాలు పడొచ్చని తెలిపింది.

ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. అమెరికాలో గుంటూరు సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ మృతి.. ఐదేళ్ల క్రితమే వివాహం.. ఆదివారం కావడంతో ట్రెక్కింగ్ కోసం క్లీవ్‌లెన్స్ మౌంటెన్‌హిల్స్‌కు వెళ్లిన దంపతులు.. 200 అడుగుల ఎత్తు నుంచి పడి శ్రీనాథ్ మృతి

మరోవైపు నవంబరులో ఏర్పడే వాయుగుండాలు తుపానుగా బలపడేందుకు అవకాశముందని విశాఖకు చెందిన వాతావరణ నిపుణుడు మురళీ కృష్ణ పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే కొద్ది రోజుల పాటు రాష్ట్ర మంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. 'అక్టోబరులో నైరుతి రుతుపవనాల తిరోగమనంలో అల్పపీడనాలు ఏర్పడడం సాధారణం. ప్రస్తుతం ఒకదాని తరువాత మరొకటి ఏర్పడుతున్నాయి. అందుకే ఎన్నడూ లేని విధంగా ఈసారి అధికంగా వర్షాలు పడుతున్నాయి. గతంలో వర్షాలు కురిసినప్పటికీ.. ఇలా  నిరంతరంగా ఎప్పుడూ కురవలేదు. మరికొన్ని రోజులపాటు ఈ తరహా వర్షాలు ఉంటాయి' అని అన్నారు.