TDP Leaders JC Prabhakar Reddy Slams BJP Leaders(X)

Anantapur, January 3:  ఏపీ బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అనంతపురంలో జేసీకి చెందిన బస్సుల దగ్దంపై స్పందించిన ప్రభాకర్ రెడ్డి..బీజేపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ కన్నా జగనే మేలు కదరా.. థర్డ్ జెండర్ కంటే తక్కువ నా కొడకల్లరా అంటూ మండిపడ్డారు. జగన్ నా బస్సులు నిలబెడితే మీ బీజేపీ ప్రభుత్వం చేతకాని కొడుకుల లాగా బస్సు తగలబెట్టారు అని దుయ్యబట్టారు. నేను ఏమైనా మీకు భయపడతా అనుకుంటున్నారా.. సిగ్గులేని నా కొడకల్లారా అంటూ తనదైన శైలీలో మండిపడ్డారు.

గతంలో మూడు వందల బస్సులకు ఆటంకం కలిగిస్తేనే తాను ఏడవలేదని ఒక్క, రెండు బస్సులకు నష్టం జరిగితే తాను చింతించనన్నారు. బస్సులను దగ్ధం చేసి ఏం సాధించారని ప్రశ్నించారు.  విజయవాడలో దారుణం, పార్కింగ్ చేసిన బైక్‌లను తగలబెట్టిన దుండగుడు..5 బైక్‌ల దగ్దం, సీసీటీవీ వీడియో వైరల్

తన పాత బస్సుల్లో ఒకటిని తన డ్రైవర్‌కు రూ. 10 లక్షల బదులు రూ. 5 లక్షలకే అమ్ముకుని డ్రైవర్‌ను ఆదుకున్నానని అలాంటి బస్సుకు నష్టం చేసి డ్రైవర్‌ జీవితాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. షార్ట్‌సర్క్యూట్‌తో బస్సు కాలిపోయిందని పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదన్నారు.

TDP Leaders JC Prabhakar Reddy Slams BJP Leaders

ఈ నెల 1వ తేదీన జేసీ దివాకర్‌ రెడ్డికి చెందిన బస్సు అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో దగ్ధమయ్యింది . ఫైర్‌ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పివేయగా బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.