TDP Leader Raja Passes Away: గుండెపోటుతో ప్రత్తిపాడు టీడీపీ నేత వరుపుల రాజా హఠాన్మరణం.. దవాఖానలో చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు మృతి.. వీడియోతో
Credits: Facebook

Kakinada, March 5: కీలక నేతల మరణాలతో టీడీపీకి (TDP) షాక్ తగులుతున్నది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ నేత వరుపుల రాజా(47) (Varupula Raja) గత రాత్రి గుండెపోటుతో (Heart Strock) హఠాన్మరణం చెందారు. గత రాత్రి 9 గంటలకు గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే కాకినాడలోని (Kakinada) సూర్య గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి స్థానిక అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స  పొందుతూ రాత్రి 11 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌ గా వ్యవహరిస్తున్న ఆయన కొన్ని రోజులుగా ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్నారు.

ప్రత్తిపాడు మండల అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజా.. డీసీసీబీ చైర్మన్‌గా, ఆప్కాబ్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు.  2019లో ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వరుపుల రాజా మృతితో టీడీపీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి విషయం తెలిసి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజా మృతి టీడీపీకి తీరని లోటని అన్నారు.