
Amaravati, March 11: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నాళ్లుగా అదుపులో ఉన్న కోవిడ్ కేసులు ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 47,803 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 174 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 8,91,178 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,88,283గా ఉంది.
ఒక్క చిత్తూరు జిల్లాలోనే గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా 60 కోవిడ్19 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 26, విశాఖ నుంచి 23 మరియు గుంటూరు జిల్లా నుంచి 12 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మునిసిపల్ కార్యాలయంలో 10 మంది ఉద్యోగులకు కోవిడ్ సోకడం కలకలం రేపుతోంది. దీంతో వారితో పనిచేసే మిగతా ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు.
రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:

గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచే 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7179కు పెరిగింది.
నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 78 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,82,841 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1158 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.