Anaparthi, FEB 17: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) తూర్పుగోదావరి జిల్లా చివరి రోజు పర్యటనలో పోలీసుల ఆంక్షలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. అనపర్తి దేవిచౌక్‌లో బహిరంగ సభకు నిన్న అనుమతి ఇచ్చిన పోలీసులు.. తీరా ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అనుమతిలేదన్నారు (Anaparthi ). చంద్రబాబును అనపర్తి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. సామర్లకోట పర్యటన ముగించుకుని అనపర్తి బయల్దేరిన చంద్రబాబును బలభద్రపురం దాటాక అడ్డగించారు. రోడ్డుకు అడ్డంగా బస్సును నిలిపారు. పోలీసులు కూడా రో (Chandrababu Road Show)డ్డుపై బైఠాయించారు. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు వాహనంపైకెక్కి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కాలినడకన అనపర్తి బయల్దేరారు. లక్ష్మీనర్సాపురం వద్ద పోలీసులు మరో బస్సును రోడ్డుకు అడ్డంగా ఉంచారు. వాటన్నింటినీ లెక్క చేయని చంద్రబాబు . సెల్‌ఫోన్ లైట్ వెలుతురులోనే ఏడు కిలోమీట్లరు నడుచుకుంటూ అనపర్తి చేరుకన్నారు. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు ప్రకటించారు.
అనపర్తి సభలో పార్టీ ప్రచార రథానికి అనుమతి ఇవ్వక పోవడంతో చంద్రబాబు గారి ప్రసంగం కోసం వేరే వాహనం ఏర్పాటు చేసిన పార్టీ శ్రేణులు. నిచ్చెన సాయంతో బొలెరో వాహనం పైకెక్కి ప్రసంగించిన టీడీపీ అధినేత @ncbn pic.twitter.com/EY3v9mVCWI
— Telugu Desam Party (@JaiTDP) February 17, 2023
దేవీచౌక్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో టీడీపీ కార్యకర్తల సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో చంద్రబాబు ప్రసంగం కొనసాగించారు.‘‘ఎన్నో అవమానాలు భరించా. ఇంకా భరిస్తా మీకోసం. ఈరోజు అనపర్తికి వస్తానంటే ముందుగా అనుమతి ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన ఆర్డర్ కాపీ కూడా నాచేతిలోనే ఉంది. జగ్గంపేట, పెద్దాపురం వెళ్తే పోలీసులు సహకరించారు. అనపర్తికి వస్తే గ్రావెల్ సూర్యనారాయణ ఉన్నారు. ఖబడ్దార్ గ్రావెల్ సూర్యనారాయణ. నాతో పెట్టుకుంటున్నావ్.. జాగ్రత్తగా ఉండు, తమాషా అనుకోవద్దు అంటూ హెచ్చరించారు.
పోలీసులు కాన్వాయ్ ని ఆపేసినంత మాత్రాన తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలను కలవకుండా వెనుదిరిగే నాయకుడు కాదు చంద్రబాబు. కాలినడకన 5 కిలోమీటర్లు నడిచేందుకు సిద్ధపడి తెలుగుదేశం అధినేత అప్రకటిత పాదయాత్ర చేస్తున్నారు. తాడేపల్లి ముసలాడు ఇంటికి పోయే రోజులు దగ్గరపడ్డాయి pic.twitter.com/kjgpsvLh5N
— Telugu Desam Party (@JaiTDP) February 17, 2023
ఆ సైకో చెప్పినట్లు వింటే తర్వాత మీరు నా దగ్గరే పనిచేయాలి గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పనులు చూసి ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది. మీరంతా 22ఏళ్లు నా దగ్గర పనిచేసేవాళ్లే గుర్తుపెట్టుకోండి. సీఎం కావాలని నేను పాదయాత్ర చేయట్లేదు. అనపర్తి నుంచి సహాయ నిరాకరణ ప్రారంభించా’’ అని చంద్రబాబు ప్రకటించారు.