Anantapur, May 21: ఏపీలోని అనంతపురం జిల్లాలో కలకలం రేగింది. ఉగ్రవాదులతో (Terror Links) సంబంధాల కేసులో ఎన్ఐఏ (NIA) అధికారులు సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని బెంగళూరులో నమోదైన కేసులో జాతీయ దర్యాఫ్తు సంస్థ ఎన్ఐఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు లేన్ లో రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. బెంగళూరులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న అబ్దుల్ కుమారుడు సోహెల్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోహెల్ ఖాతాలోకి భారీగా నగదు బదిలీ కావడంతో అబ్దుల్, సోహెల్, అతడి కుటుంబసభ్యులను అధికారులు ప్రశ్నించారు. కొంతకాలంగా అబ్దుల్ కుమారుడు కనిపించకుండా పోవడంతో ఎన్ఐఏ అధికారులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అబ్దుల్ ఇంట్లో తనిఖీలు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదులతో లింకులపై ఆరా తీస్తున్నారు.
#NIA raids on the house of Abdul, retired headmaster, in #Rayadurgam in #Anantapur #Andhra Pradesh. Abdul’s sons are hiding for quite sometime and the NIA suspects terror links to them. pic.twitter.com/gLnzZ7FWAL
— shinenewshyd (@shinenewshyd) May 21, 2024
రాయదుర్గంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు కలకలం రేపాయి. నాగులబావి వీధిలోని రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. అబ్దుల్ కుమారులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. అయితే, కొంతకాలంగా అబ్దుల్ కుమారులు కనిపించకుండా పోయారు. దీంతో ఎన్ఐఏ అధికారులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అబ్దుల్ ఇంట్లో తనిఖీలు చేసిన ఎన్ఐఏ అధికారులు.. ఉగ్రవాదులతో లింకులపై ఆరా తీస్తున్నారు.
అర్థరాత్రి ఒకటిన్నర సమయంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఆయన ఇద్దరు కుమారులు మూడు నెలల నుంచి కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అబ్దుల్ కుమారులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారు. అబ్దుల్ కుమారుడు సోహెల్ అదుపులోకి తీసుకుని ఇంట్లోనే విచారించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఎంక్వైరీ చేశారు.