Vishakhapatnam November 06: ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ అరెస్టయ్యాడు. ఈ నెల 11 వరకు రిమాండ్ విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆరు నెలల క్రితం నమోదైన కేసులో బెయిల్‌పై విడుదలైన భార్గవ్, కోర్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు మళ్లీ అరెస్టయ్యాడు.
పెందుర్తి వేపగుంట సింహపురికాలనీకి చెందిన 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడని టిక్‌టాక్ భార్గవ్‌ను దిశ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్ విధించారు. అయితే ఆయన నిబంధనలతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యాడు.
కానీ మళ్లీ సోషల్ మీడియాలో కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ పోస్టులు పెట్టడం, అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దిశ పోలీసులు నిందితుడ్ని తిరిగి అరెస్ట్‌చేసి న్యాయస్థానంలో శుక్రవారం హాజరుపరిచారు. దీంతో ఫన్ బకెట్ భార్గవ్‌కు ఈనెల 11వరకు రిమాండ్ విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. అతనికి శుక్రవారం కేజీహెచ్‌లో వైద్యలు వైద్య పరీక్షలు నిర్వహించారు.