Tirupati, May 2: తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ (Tirupati Lok Sabha Bypoll Results 2021) ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పోస్ట్ బ్యాలెట్ల నుంచి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగిస్తోంది. వైఎస్సార్‌సీపీ (YSRCP) మెజార్టీ మూడు గంటల సమయానికి 2 లక్షల 31 వేలు దాటింది. పోస్ట్ బ్యాలెట్ల నుంచి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 2,24,240 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళ్తున్నారు.
కాంగ్రెస్ (Congress) పార్టీ అభ్యర్థికి8,477 ఓట్లు రాగా, నోటాకు 11,509 ఓట్లు పోలవడం గమనార్హం. కౌంటింగ్ ప్రక్రియను నలుగురు పరిశీలకులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ విజయం దాదాపు ఖరారు కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి.
మొత్తం తిరుపతిలో (Tirupati) 9, 50, 608 ఓట్ల పోలవగా..ఈ మొత్తానికి కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు అధికార వైసీపీ 5,37,152 ఓట్లను గెలుచుకోగా, టీడీపీ (TDP) 3.05,209 ఓట్లను గెలుచుకుంది. బీజేపీ-జనసేన కూటమి 50, 739 ఓట్లను గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ 8,477 ఓట్లను గెలుచుకుంది. మొత్తం 25 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతోంది.
వైసీపీ విజయం ఖరారు కావడంతో కౌంటింగ్ కేంద్రం బయట ఉన్న వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి అనుచరులు, నేతలు, వైసీపీ కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ ఆధిక్యతపై తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ.. ఏ పార్టీకి ఏజెంట్లు లేకుండా వన్‌సైడ్‌గా పోలింగ్ జరిగిందని విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. ఎన్నికల రోజు ఎన్నికల ఏజెంట్ తనను కూడా స్వయంగా తిరుమలకు పంపలేదని ఆమె చెప్పుకొచ్చారు.