Tirumala Masala Vada (Credits: X)

Tirumala, Jan 21: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తిరుమలలోని వేంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రంలో అన్నప్రసాదంలో కొత్తగా మసాలా వడలు (Tirumala Masala Vada) పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలిసారిగా ప్రయోగాత్మకంగా సోమవారం పరిశీలించారు. ట్రయల్ రన్‌ లో భాగంగా దాదాపు 5వేల మంది భక్తులకు ఉల్లిపాయలు వాడకుండా చేసిన మసాలా వడలను వడ్డించారు. మంగళవారం నుంచి సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. కొద్ది రోజులు ట్రయల్‌ రన్‌ కొనసాగించనున్నారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే సవరించి.. మెనూకు రూపకల్పన చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

తుపాకీ మోతతో దద్దరిల్లిన దండకారణ్యం.. ఛత్తీస్‌ గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది మావోయిస్టులు మృతి

Here's Video:

అప్పటి నుంచి పూర్తిస్థాయిలో..

ఈ ఏడాది రథసప్తమి అంటే ఫిబ్రవరి 4న  నుంచి పూర్తిస్థాయిలో అందరు భక్తులకు మసాలా వడలు వడ్డించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. తొలిసారిగా ప్రయోగాత్మకంగా మసాలా వడలు వడ్డించగా.. భక్తులు రుచికరంగా ఉన్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు.

భైరవద్వీపం మూవీ విలన్ విజయ్ రంగరాజు కన్నుమూత, గుండెపోటుకు గురై మృతి చెందిన గోపీచంద్ మూవీ యజ్ఞం నటుడు