Bhumana karunakar Reddy (Photo-Video Grab)

Tirumala, Jun 29: టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chiarman Bhumana Karunakar Reddy) అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సర బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్‌ రూపొందించింది. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా నూతన వివాహం చేసుకోనే వధూవరులకు బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.

పాలకమండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి (TTD Chairman bhumana karunakar reddy) మీడియాతో నిర్ణయాలను వెల్లడించారు. టీటీడీ ప్రత్యేకంగా మంగళ సూత్రాలు తయారు చేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదే తరహాలో లక్ష్మీ కాసులను కూడా విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాస్ట్ టూ కాస్ట్ విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పోటులో పనిచేసే 70 మంది స్కిల్డ్ కార్మికులను గుర్తించమని…వారి జీతాన్ని 15 వేలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇదే తరహాలో 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను రూ. 35 వేల నుంచి రూ. 54 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు.

శ్రీవారి దర్శనం టికెట్లు ఉంటేనే తిరుమల కొండపై వసతి గదులు.. భక్తుల రద్దీ తగ్గించేందుకు టీటీడీ కీలక నిర్ణయం

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో పని చేసేందుకు నూతనంగా పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. 3, 4, 5వ తేదీల్లో ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ తెలిపారు. 57 మంది మఠ, పీఠాధిపతులు హాజరువుతున్నారన్నారు. వారి సలహాలు, సూచనలను స్వీకరించి అమలు చేస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.

టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు, టీటీడీ పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాలలో భక్తులు సౌకర్యార్దం ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వ అనుమతికి లేఖ రాసినట్లు చెప్పారు.గోగర్బం నుంచి ఆకాశగంగ వరకు నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి 30 కోట్లు, నారాయణవనంలో కొలువైన భధ్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ది పనులకు 6.9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. స్విమ్స్ అభివృద్ది పనులుకు 148 కోట్లు కేటాయింపుకు ఆమోద ముద్ర వేశామన్నారు. రూ. 2.5 కోట్లతో సప్తగిరి అతిధి గృహలు అభివృద్ది పనులుకు. ఎస్ఏంసీ, ఎస్ఎన్ సీకాటేజీల అభివృద్ది పనులుకు 10 కోట్లు కేటాయించామన్నారు.

టికెట్లు బుక్ చేసుకునే శ్రీవారి భక్తులకు అలెర్ట్‌, టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ పేరు ttdevasthanams.ap.gov.in గా మార్చిన అధికారులు

వాటర్ వర్క్స్. అన్నప్రసాదం, వేదపాఠశాలలో ఉద్యోగులు, టీటీడీ స్టోర్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంచుతున్నట్లు భూమన తెలదిపారు. వేదపండితుల పేన్షన్ 10 వేలు నుంచి 12 వేలుకు పెంచారన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకుల జీతాలు పెంచుతామన్నారు. 56 వేదపారాయణదారులు పోస్టులు నియామకానికి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపుకు సహకరించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతు తీర్మానం చేశామన్నారు.

అటవిశాఖ ఉద్యోగుల సమస్య గురించి మంగళవారం కార్మికులుతో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహిస్తారని టీటీడీ చైర్మన్‌ తెలిపారు. ఉద్యోగుల సమస్య పరిష్కారం పట్ల పాలకమండలి సానుకూలంగా ఉందన్నారు. పిబ్రవరి 3 నుంచి 5వ తేది వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తూన్నామని, దీనికి 57 మంది మఠాధిపతులు, పిఠాధిపతులు సదస్సుకు హజరవుతారని తెలిపారు.

ధార్మిక ప్రచారంలో భాగంగా వారి సూచనలు,స లహాలను టీటీడీ తూచా తప్పకూండా అమలు చేస్తామన్నారు. హుండి ద్వారా 1611 కోట్లు, వడ్డి ద్వారా 1,167 కోట్లు, ప్రసాదం విక్రయం ద్వారా 600 కోట్లు,దర్శన టిక్కేట్లు విక్రయం ద్వారా 338 కోట్లు వస్తూందని అంచనా వేశామన్నారు. జీతాలు చెల్లింపుకు 1.733 కోట్లు, ముడిసరుకులు కోనుగోలుకు 751 కోట్లు, కార్పస్ ఫండ్‌కుకి 750 కోట్లు, ఇంజనీరింగ్ పనులుకు 350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

విభాగాల వారీగా కేటాయింపులు ఇలా..

ఇంజినీరింగ్ విభాగానికి రూ.350 కోట్లు

హిందూ ధర్మప్రచార, అనుబంధ ప్రాజెక్టులకు రూ.108.50 కోట్లు

వివిధ సంస్థలకు గ్రాంట్స్ రూపంలో రూ.113.50 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం రూపంలో రూ.50 కోట్లు

టీటీడీ విద్యాసంస్థలు, వివిధ వర్సిటీలకు గ్రాంట్స్ రూ.173.31 కోట్లు

పారిశుద్ధ్య విభాగానికి రూ.261.07 కోట్లు

నిఘా, భద్రతా విభాగానికి రూ.149.99 కోట్లు

వైద్య విభాగానికి రూ.241.07 కోట్లు

టీటీడీ 2024-25 వార్షిక బడ్జెటుకు రాబడి వివరాలు, కీలక నిర్ణయాలు

హుండీ ఆదాయం రూ.1611 కోట్ల అంచనా..

బ్యాంకు డిపాజిట్ల వడ్డీల ద్వారా రూ.1068.51 కోట్ల అంచనా..

లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.550 కోట్లు..

దర్శన టికెట్ల విక్రయాల ద్వారా రూ.468 కోట్ల అంచనా..

గదుల వసతి సౌకర్యం ద్వారా రూ.142 కోట్లు..

పుస్తకాల విక్రయాల ద్వారా రూ.35.25 కోట్లు..

అగర్బత్తి, టోల్ గేట్, విద్య కళాశాల ద్వారా రూ.74.50 కోట్లు..

కళ్యాణ కట్ట ద్వారా రూ.226.50 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు.

స్విమ్స్ అస్పత్రిలో 300 పడకల నుంచి 1200 పడకల పెంపుకు రూ.148 కోట్లతో టెండర్ ఆమోదం..

రూ.2.5 కోట్లతో సప్తగిరి సత్రాల్లో అభివృద్ధి పనులు..

ఎస్ఎంసీతో పాటు పలు కాటేజీల ఆధునీకరణకు రూ.10 కోట్లు మంజూరు.

టీటీడీలో ఒరాకిల్ ఫ్యూషన్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ వినియోగానికి ఆమోదం.

అన్నమయ్య భవన్ ఆధునీకరణకు రూ.1.47 కోట్లు కేటాయింపు.