TTD Chairman YV Subba Reddy (Photo-TTD)

తిరుమలలో రూ. 4 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ. 1 కోటి 28 లక్షలతో వసతి గృహాల ఆధునీకరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సోమవారం సమావేశమైంది. సమావేశ తీర్మానాలను టీటీడీ ఛైర్మన్ మీడియాకు వెల్లడించారు.

రూ. 40.50 కోట్లతో వ్యర్థాల నిర్వహణ కోసం ప్రైవేటు ఏజెన్సీకి మూడు సంవత్సరాల కాలపరిమితికి అనుమతి ఇచ్చినట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఒంటిమిట్టలో దాతల సాయంతో రూ.4 కోట్లతో నూతన అన్నదాన భవన నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంతో 2,445 నూతన ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని, శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నేటి నుంచి 3 రోజుల పాటు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు, హైదరాబాద్‌లో ఈ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు

టీటీడీ పాలకమండలి నిర్ణయాలు

►తిరుమలలో రూ.3.55 కోట్లతో పోలీసు క్వార్టర్స్ ఆధునీకీకరణ

►శ్రీవెంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయంలో రూ.5 కోట్లతో వసతి గృహాలు

► రూ.9.5 కోట్లతో టీటీడీ పరిపాలన భవనంలో సెంట్రలైజ్డ్ రికార్డు రూమ్‌కు ఆమోదం

►రూ.97 కోట్లతో స్విమ్స్ ఆస్పత్రి ఆధునీకీకరణకు ఆమోదం

►29 కొట్ల 50 లక్షలతో ఎఫ్ఎంఎస్‌కు కేటాయింపు

►ఒంటి మిట్ట కోదండ రామాలయం వద్ద ప్రతి రోజు అన్న ప్రసాదం వితరణ, నూతన భవన నిర్మాణానికి

► తిరుమలలో 3 కోట్లు10 లక్షలతో తిరుమలలో ప్లాస్టిక్ చెత్త కుండీల ఏర్పాటు.

► ఎస్వీ వేదిక్ యునివర్సిటీ స్టాప్ క్వార్టర్స్ నిర్మాణానికి 5 కోట్లు మంజూరు.

►తిరుమలలో ఉన్న కంప్యూటర్‌లను తొలగించి, రూ.7.44 కోట్లతో ఆదునిక కంప్యూటర్ కొనుగోలుకు నిర్ణయం

►నగిరిలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి 2 కోట్లు కేటాయింపు

►కర్నూలు జిల్లాలో 4 కోట్ల 15 లక్షలతో శ్రీవేంకటేశ్వర ఆలయం పునరుద్ధరణ.

►స్వీమ్స్‌ను పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేసి బెడ్స్ మరింత పెంచాలని నిర్ణయం

►1,200 పడకలతో స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధి, 97 కోట్లతో నూతన భవనాలు నిర్మాణం శ్రీకారం.

►జమ్మూ కాశ్మీర్ లో 24 నెలలో ఆలయం పూర్తి చేసి, వైభవంగా ఆలయాన్ని ప్రారంభించాం.

►తిరుచానూరు పుష్కరిణికి ఇత్తడి గ్రిల్స్ అమరిక 6 కోట్లు కేటాయించారు.

►తిరుపతి రామానుజ సర్కిల్ నుండి రేణిగుంట వరకు బిటి రోడ్డు నిర్మాణానికి 5.16 కోట్లు

►పట్టణాలతో సమానంగా గిరిజన ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలు, కళ్యాణమండపాలు నిర్మిస్తున్నాం.

►గుజరాత్ గాంధీనగర్, ఛత్తీస్‌గఢ్ రాయపుర్ లో త్వరలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేస్తాం

►శ్రీవాణి ట్రస్ట్‌పై కొంతమంది రాజకీయ లబ్ది కోసం అసత్య ప్రచారం చేస్తున్నారు

►సనాతన హిందు దర్శ ప్రచారంలో దేశవ్యాప్తంగా దేవాలయాలు ఏర్పాటుకి శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు.

►వచ్చే నిధులు ఆలయ నిర్మాణం కోసం వాడాలని గొప్ప నిర్ణయం తీసుకున్నాం.

►హుండీ, కార్పస్ ద్వారా వచ్చే ఆదాయం అంతా తెలియపరిచాము, శ్వేతపత్రం విడుదల చేశాం.

►శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగం, టీటీడీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఖండిస్తూ తీర్మానం.

►శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా వచ్చే నిధులతో 2. 445 ఆలయాలు నిర్మాణం చేస్తున్నాం.

►అధికశాతం బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ఉన్న ప్రాంతాలలో చేపట్టాం

►పురాతణ ఆలయాలు 200 పైగా పునర్నిర్మాణం చేశాం.

►దూప దీప నైవేద్యాలు, గోసంరక్షణ, ధర్మ ప్రచారం కోసం వినియోగం.

►పది వేలు తీసుకొంటున్నారు, 300 బిల్లు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అవన్నీ అసత్యం

►విరాళం ఇచ్చిన అందరికి విరాళం బిళ్లు, దర్శన టికెట్లకు రసీదులు ఇస్తున్నాం

►ఇలాంటి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొంటాం.

►తిరుమలలో నిషేధిత వస్తువులు రావడం అనే దానిపై చర్చించాం.

►ఇలాంటి సమస్యలు రాకుండా నూతన యంత్రాలను ఏర్పాటు చేస్తాం.

►విమానాలు ఆలయంపై తిరగకుండా విమాన శాఖకు లేఖ రాశామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.